చంద్రబాబు Reloaded: బాలయ్య టాక్‌షోలో పంచ్‌లతో పండగ..!!

అమరావతి: టాలీవుడ్ టాప్ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. తన కేరీర్‌లోనే మొదటిసారిగా హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న టాక్ షో- అన్‌స్టాపబుల్. గత ఏడాది బుల్లితెరపై సందడి చేసిన ఈ షోకు కొద్దిరోజుల పాటు బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్లీ ఫ్రెష్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అన్‌స్టాపబుల్ 2 తొలి ఎపిసోడ్‌ షూటింగ్ కూడా పూర్తయింది. ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు చెందిన ఆహా‌లో ఈ టాక్ షో టెలికాస్ట్ కానుంది.

 త్వరలో టెలికాస్ట్..

త్వరలో టెలికాస్ట్..

ఈ నెల 14వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో ఇది టెలికాస్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన ప్రీ ఫంక్షన్‌ను త్వరలో నిర్వహించడానికి యూనిట్ సన్నాహకాలు చేస్తోంది. ఓ బిగ్గెస్ట్ టాక్‌షో‌నకు అదే రేంజ్‌ బిగ్గెస్ట్ స్టార్ హీరో నందమూరి బాలక‌‌ృష్ణ హోస్ట్‌గా ఉండటం వల్ల దీనిపై అంచనాలు అమాంతం పెరిగాయి. అందులోనూ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌కు చెందిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ఇది ప్రసారం కాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

 చంద్రబాబు తొలి గెస్ట్‌..

చంద్రబాబు తొలి గెస్ట్‌..

తొలి ఎపిసోడ్‌లో తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గెస్ట్‌గా కనిపించనున్నారు. అన్న‌పూర్ణ స్టూడియోలో చంద్ర‌బాబు పాల్గొన్న షూటింగ్‌ను కొద్దిసేపటి కిందటే పూర్తి చేసుకున్నారు బాలకృష్ణ. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కొత్తగా..

కొత్తగా..

రాజకీయాలతో తలమునకలై కనిపించే తెలుగుదేశాధీశుడు ఈ ఎపిసోడ్ సందర్భంగా కొత్తగా కనిపించారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టడానికి ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలను పన్నడం, దానికి అనుగుణంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయ్యడంలో తీరిక లేకుండా గడుపుతోన్న చంద్రబాబు- ఈ ఎపిసోడ్‌ షూటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. బాలకృష్ణ అడిగిన పలు ప్రశ్నలకు అంతే ఉత్సాహంతో సమాధానాలు ఇవ్వడం కనిపించింది.

 విక్టరీ సింబల్‌తో..

విక్టరీ సింబల్‌తో..

తనకు మాత్రమే సొంతమైన ట్రెడ్‌మార్క్ విక్టరీ సింబల్ చూపుతూ ఆయన షూటింగ్ ఫ్లోర్ మీదికి ఎంటర్ అయ్యారు. ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్నవారంతా ఆయనను సీఎం..సీఎం అంటూ ఉత్సాహపరిచారు. ఫ్లోర్ మీదికి వచ్చిన ఆయనకు బాలకృష్ణ బొకెను ఇచ్చి గ్రాండ్‌గా స్వాగతం పలికారు. బావ-బావమరిది మధ్య షూట్ చేసిన ఈ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. కొన్ని సందర్భాల్లో బాలయ్య కంటే చురుగ్గా, వేగంగా కనిపించారు చంద్రబాబు.

అప్పట్లో మోహన్ బాబు

అప్పట్లో మోహన్ బాబు

గత ఏడాది ఆరంభమైన అన్‌స్టాపబుల్‌లో తొలి ఎపిసోడ్‌లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గెస్ట్‌గా హాజరైన విషయం తెలిసిందే. ఆయన స్నేహితుడు, చిత్తూరు జిల్లాకే చెందిన చంద్రబాబు ఈ అన్‌స్టాపబుల్ 2కు గెస్ట్‌గా రావడం యాదచ్ఛికంగా చెప్పుకోవచ్చు. బావ-బావమరదుల మధ్య సాగిన సంభాషణకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాలంటే- ఫుల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యంత వరకు వేచి చూడాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+