మావయ్యా.... అని నోరారా పిలుస్తూ.. మెగాస్టార్ చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్నల వీడియోలు వైరల్

అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మ విభూషణ్ పురస్కారాన్ని సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. భారత రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకోవడానికి ముందు మెగాస్టార్ చిరంజీవికి, మెగా కోడలు ఉపాసన కొణిదెల కు మధ్య ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. ఇక ఆ సన్నివేశం తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది.

చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ పురస్కారాన్ని తీసుకోవడానికి ముందు చిరంజీవికి, ఉపాసనకు మధ్య ఒక సరదా సంభాషణ జరిగింది. ఆ సంభాషణలో మెగా కోడలు ఉపాసన చిరంజీవికి ఒక ప్రశ్న సంధించారు. మావయ్య క్లీంకారకు, నాకు మధ్య ఉన్న కామన్ పాయింట్ ఏంటో చెప్పండి అంటూ చిరంజీవిని ఉపాసన ప్రశ్నించారు. దీనికి ఒక క్షణం ఆలోచించిన చిరంజీవి క్లీంకార నీకు ప్రతిరూపం అంటూ వ్యాఖ్యానించారు.

Upasana fun questions to Megastar Chiranjeevi before and after padma vibhushan taking ceremony

ఉపాసన తాతగారికి పద్మ విభూషణ్
దానికి ఉపాసన వెంటనే నో..మావయ్య... మేమిద్దరం... పద్మ విభూషణ్ ల మరవరాళ్ళం అంటూ నవ్వుతూ చెప్పారు. ఇది విన్న చిరంజీవి కూడా నిజమే కదూ అంటూ పేర్కొన్నారు. ఉపాసన తాతగారైన ప్రతాప్ సి. రెడ్డి గారికి 2010లో పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన విషయాన్ని చిరంజీవి ఉపాసన వ్యాఖ్యలతో గుర్తుచేసుకున్నారు.

క్లీంకార వచ్చిన తర్వాత ఇది బిగ్గెస్ట్ అవార్డు
పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్న తర్వాత కూడా ఉపాసన మామయ్య గారండి ఈరోజు మీ ఫీలింగ్ ఏంటి అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా చిరంజీవి క్లీంకార వచ్చిన తర్వాత ఇది బిగ్గెస్ట్ అవార్డు అంటూ పేర్కొన్నారు. ఈ వీడియోని కూడా ఉపాసన షేర్ చేశారు. పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న తరువాత చిరంజీవి కేంద్ర ప్రభుత్వం తనకు అందించిన పురస్కారం పైన కృతజ్ఞతలు తెలియజేశారు.

మిమ్మల్ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది రాం చరణ్ పోస్ట్
ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టిన చిరంజీవి కళామతల్లికి కళా రంగంలో నన్ను వెన్ను తట్టి నడిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అన్నారు నన్ను ప్రేమించిన, అభిమానించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఇక మరోవైపు రామ్ చరణ్ తేజ్ పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్న చిరంజీవిని ఉద్దేశించి "శుభాకాంక్షలు నాన్న.. మిమ్మల్ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది" అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+