జగన్, చంద్రబాబు, పవన్... ''నాలుగు రాళ్లు'' సంపాదించుకునేది ఇక్కడే??
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు మారుతూ వస్తున్నాయి. ఎప్పుడు ఏ పార్టీకి అనుకూలంగా వాతావరణం మారుతుందో, ఏ పార్టీకి వ్యతిరేకంగా మారుతుందో అర్థం కాని స్థితికి చేరుతున్నాయి. ఒక జిల్లాలో ఒక పార్టీకి వాతావరణం బాగుందనిపిస్తుంటే మరో జిల్లా ఆ పార్టీకి వ్యతిరేకంగా మారుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకే పార్టీకి సానుకూల వాతావరణం మాత్రం కనిపించడంలేదు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి మాత్రం ఇప్పుడు నాలుగు ఉమ్మడి జిల్లాలు ఊపిరి పోస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Recommended Video

ఈ నాలుగు అత్యంత కీలకమైనవి
తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి సానుకూల వాతావరణం ఏర్పడుతోందని సీనియర్ రాజకీయవేత్తలు సైతం అభిప్రాయపడుతున్నారు. ఈ నాలుగు జిల్లాల్లో మొత్తం 67 నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 13 జిల్లాల్లోను తన హవా చాటింది. అయితే అప్పుడుతున్న వేవ్ ఇప్పుడు కనపడటంలేదని, కొన్ని జిల్లాల్లో బలంగా ఉన్నప్పటికీ మరికొన్ని జిల్లాల్లో నేతల మధ్య విభేదాలవల్ల బలహీనపడుతోందని ఆ పార్టీ వర్గాలే అంచనా వేస్తున్నాయి. నేతల మధ్య విభేదాలను ప్రతిపక్షాలైన తెలుగుదేశం, జనసేన అందిపుచ్చుకుంటున్నాయి.

జనసేన వల్ల వైసీపీకి లాభం?
ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని పరిశీలిస్తే ఈ నాలుగు జిల్లాలో తెలుగుదేశంపార్టీది పై చేయిగా కనిపిస్తోంది. కానీ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టిన జనసేన వల్ల టీడీపీ నష్టపోయే అవకాశం ఉంది. ఈసారి కాపు సామాజికవర్గ ఓట్లు ఏకీకృతమై గుంపగుత్తగా జనసేనకు పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీకి ఎంత ఆధిక్యత పెరిగినప్పటికీ ఈ రెండూ విడిగా పోటీచేస్తే ఈ నాలుగు జిల్లాల్లో కూడా వైసీపీ లాభపడుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి.

పొత్తు పెట్టుకుంటే వైసీపీకి నష్టం?
ఒకవేళ తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకుంటే వైసీపీ నష్టపోతుందంటున్నారు. గత ఎన్నికల్లో జనసేన బరిలో ఉన్నప్పటికీ కాపు సామాజికవర్గ ఓటర్లు వైసీపీవైపే మొగ్గుచూపారు. కానీ ఈసారి పరిస్థితి అలా లేదంటున్నారు. కాపు ఓట్లను వైసీపీకి రాబట్టేలా ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ఒక ప్రణాళిక రచించారని, రానున్నరోజుల్లో కానీ, ఎన్నికల సమయానికి కానీ దాన్ని అమలు చేస్తారని ఆ పార్టీవర్గాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications