కపిల తీర్థం ట్రాజెడీ ఎఫెక్ట్, ఇక డేంజర్ జోన్: నీటి గుండాల వద్ద ఎస్పీ (పిక్చర్స్)
చిత్తూరు: కపిల తీర్థంలో ఉన్న నీటి గుండాలను తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అధికారులు, ఫారెస్ట్ అధికారులతో కలిసి అర్బన్ జిల్లా ఎస్పీ గోపినాథ్ గురువారం నాడు పరిశీలించారు.
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇటీవల విషాద సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కపిల తీర్థం జలపాతంలో భక్తులు గల్లంతయ్యారు. ఎనిమిది మంది మృతి చెందారు.
ఈ నేపథ్యంలో ఎస్పీ గోపినాథ్ తదితరులు కపిలతీర్థం నీటి గుండాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గోపినాథ్ విలేకరులతో మాట్లాడారు.

కపిల తీర్థం
కపిల తీర్థంలో ఉన్న నీటి గుండాలను తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అధికారులు, ఫారెస్ట్ అధికారులతో కలిసి అర్బన్ జిల్లా ఎస్పీ గోపినాథ్ గురువారం నాడు పరిశీలించారు.

కపిల తీర్థం
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇటీవల విషాద సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కపిల తీర్థం జలపాతంలో భక్తులు గల్లంతయ్యారు. ఎనిమిది మంది మృతి చెందారు.

కపిల తీర్థం
ఈ నేపథ్యంలో ఎస్పీ గోపినాథ్ తదితరులు కపిలతీర్థం నీటి గుండాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గోపినాథ్ విలేకరులతో మాట్లాడారు.

కపిల తీర్థం
ఎనిమిది నిండు ప్రాణాలను బలిగొన్న ఈ నీటి గుండాన్ని డేంజర్ జోన్‌గా గుర్తిస్తామని అర్బన్ జిల్లా ఎస్పీ గోపినాథ్ చెప్పారు.

కపిల తీర్థం
ఇక పైన ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పకడ్బంధీ చర్యలు తీసుకుంటామని అర్బన్ జిల్లా ఎస్పీ గోపినాథ్ చెప్పారు.

కపిల తీర్థం
ఈ నీటి గుండాల వద్ద ఒకటో గుండము, రెండో గుండము, మూడో గుండముతో కలిపి మహా ప్రాకార షెంపింగ్ ఏర్పాటు చేస్తామని అర్బన్ ఎస్పీ చెప్పారు.

కపిల తీర్థం
ఇక పైన భక్తులు ఎవరూ ఇక్కడికి వెళ్లకుండా పకడ్బంధీగా సెక్యూరిటీ పెట్టే విధంగా టిటిడి, ఫారెస్ట్ అధికారులతో కలిసి చర్చించి ఏర్పాటు చేస్తామని ఎస్పీ చెప్పారు.

కపిల తీర్థం
త్వరలో దీని పైన పరిష్కారం గుర్తించి, రాష్ట్ర డిజిపి, టిటిడి ఫారెస్ట్ అధికారుల దృష్టికి తీసుకు వెళ్తామని అర్బన్ జిల్లా ఎస్పీ గోపినాథ్ చెప్పారు.

కపిల తీర్థం
టిటిడి లేదా ఫారెస్ట్ వారు.. కంచెను ఎవరు ఏర్పాటు చేస్తారనే విషయాన్ని తాము చర్చించిన తర్వాత చెబుతామని తెలిపారు.

కపిల తీర్థం
సాధ్యమైనంత త్వరగా భద్రత ఏర్పాట్లు పూర్తి చేస్తామని అర్బన్ ఎస్పీ గోపినాథ్ చెప్పారు. కాగా, వీరితో పాటు పలువురు పరిశీలించారు.












Click it and Unblock the Notifications