చంద్రబాబును కలిసిన అమెరికా కాన్సుల్ జనరల్
చంద్రబాబును కలిసిన అమెరికా కాన్సుల్ జనరల్
విజయవాడ: అమెరికా నుంచి ఎక్కువ మంది పౌరులు ఆంధ్రప్రదేశ్ ను సందర్శించి, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు సహకరిస్తానని హైదరాబాద్ లోని యూఎస్ కాన్సుల్ జనరల్ కేథరిన్ హడ్డా ముఖ్యమంత్రి చంద్రబాబుకు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్-అమెరికా మధ్య మెరుగైన సంబంధాలు కొనసాగాలని ఆమె ఆకాంక్షించారు. మంగళవారం విజయవాడలోని సీఎం కార్యాలయంలో చంద్రబాబును ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. భవిష్యత్ తరాల కోసం చంద్రబాబు ఒక లక్ష్యం నిర్దేశించుకుని అందుకనుగుణంగా చేస్తున్న కృషిని తాను చాలా సార్లు విన్నాని కేథరిన్ హడ్డా తెలిపారు.












Click it and Unblock the Notifications