పిసిసి అధ్యక్ష పదవి అడిగితే తప్పేంటి?: వీహెచ్, కెసిఆర్‌పై పొన్నాల
హైదరాబాద్: తాను తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి అడిగితే తప్పేంటని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభసభ్యుడు వి హనుమంతరావు ప్రశ్నించారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. మూడు సార్లు ఓడిపోయిన వారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని, తాను పిసిసి అధ్యక్ష పదవి అడగడంలో తప్పులేదని అన్నారు.
తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీయే ఉంటుందని హనుమంతరావు అన్నారు. తెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది కాంగ్రెస్సేనని అన్నారు. దీనిలో భారతీయ జనతా పార్టీ పాత్ర ఏమీ లేదని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు జనవరి 20న దిగ్విజయ్ సింగ్ వస్తున్నారని తెలిపారు.

సిఎంకు ప్రజాసంక్షేమంపై చిత్తశుద్ధిలేదు: కెసిఆర్
తెలంగాణలో వాస్తవాలు తెలుసుకోలేని దౌర్భాగ్య పాలన కొనసాగుతోందని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిఎం చంద్రశేఖర్ రావుకు 7 నెలల తర్వాత ప్రజల బాధలు తెలిశాయా? అంటూ మండిపడ్డారు.
వరంగల్‌లోని ఒక్క మురికివాడలోనే అన్ని సమస్యలు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందో అర్థమైందా..? అంటూ పొన్నాల సిఎంను ప్రశ్నించారు. కెసిఆర్‌కు రాజకీయం తప్ప ప్రజాసంక్షేమంపై చిత్తశుద్ధిలేదని విమర్శించారు. ప్రజల ఉసురు కెసిఆర్‌కు తప్పక తగులుతుందని పొన్నాల అన్నారు.












Click it and Unblock the Notifications