వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ దమ్ము లేక ధర్నాలు చేయాలంటూ చంద్రబాబు కొత్త నాటకం: వల్లభనేని వంశీ ఫైర్

|
Google Oneindia TeluguNews

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును టార్గెట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ధర్నాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే .ఆందోళనలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడిన వల్లభనేని వంశీ టీడీపీ ఆదోళనలు కేవలం డ్రామాలని మండిపడ్డారు.

ప్రభుత్వంపై బురదజల్లడానికి చంద్రబాబు కుట్రలు
కేంద్ర ప్రభుత్వం పెట్రోలు డీజిల్ ధరలను పెంచిందని సెస్ పేరుతో కోట్లాది రూపాయలను వసూలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాను కూడా కేంద్రం ఇవ్వడంలేదని వల్లభనేని వంశీ అసహనం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కేంద్రాన్ని నిలదీసే దమ్ము ధైర్యం చంద్రబాబుకు లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన వల్లభనేని వంశీ చంద్రబాబుకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, ధర్నాలు చేయాలంటూ చంద్రబాబు కొత్త నాటకానికి తెర తీశాడు అని వల్లభనేని వంశీ మండిపడ్డారు.

Vallabhaneni Vamsi fires on Chandrababu over his comments and dharnas on petrol-diesel prices in ap

చంద్రబాబు కొంగ జపాలు నమ్మడానికి జనం సిద్ధంగా లేరు
చంద్రబాబు విష ప్రచారాలను నమ్మడం కోసం ప్రజలు ఎవరూ సిద్ధంగా లేరని వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. చంద్రబాబు కొంగ జపాలు నమ్మడానికి జనం సిద్ధంగా లేరని ఆయన పేర్కొన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసినా బద్వేలు లో డిపాజిట్ కూడా రాలేదని వల్లభనేని వంశీ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయిందని వల్లభనేని వంశీ ఎద్దేవా చేశారు. దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిన క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుకు ఇంధన ధరలపై విధించిన వ్యాట్ ను పూర్తిగా రద్దు చేసి సీఎం జగన్ మోహన్ రెడ్డి తన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు.

పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తున్న చంద్రబాబు
పెట్రోల్, డీజిల్ ధరల పై వ్యాట్ ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేసిన చంద్రబాబు వైయస్ జగన్మోహన్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరల పై వ్యాట్ ను పూర్తిగా రద్దు చేస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చారని గుర్తుచేసి, ఆ హామీలను నెరవేర్చుకోవాలని పేర్కొన్నారు. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి ఆ హామీని పట్టించుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు జగన్ ఇచ్చిన హామీ ప్రకారం పెట్రోల్ ధరలపై పదహారు రూపాయలు, డీజిల్ ధరలపై 17 రూపాయలు తగ్గించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

పెట్రోల్, డీజిల్ ధరలపై టీడీపీ నేతల వ్యాఖ్యలకు వైసీపీ రివర్స్ కౌంటర్
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడంపై జగన్ సర్కార్ రాష్ట్ర ప్రజలకు మొండిచెయ్యి చూపించిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. జగన్ రెడ్డి పాలనలో అవినీతి, ప్రజావ్యతిరేక విధానాలకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని చంద్రబాబు ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు వ్యతిరేకంగా పోరుబాట పట్టిన టి.డి.పి జగన్మోహన్ రెడ్డిని పదేపదే ఈ వ్యవహారంపై టార్గెట్ చేయడంతో వైసీపీ మంత్రులు నేతలే కాకుండా, వల్లభనేని వంశీ వంటి నాయకులు కూడా చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.

English summary
Vallabhaneni Vamsi was angry at the TDP for going on strike targeting the AP government over petrol and diesel prices. Vallabhaneni Vamsi fires, saying that Chandrababu is playing a new dramas to do dharnas .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X