హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆకట్టుకున్న ‘వనమాలి నాటకోత్సవం’(పిక్చర్స్)

By Super
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తపన ఉంటేనే ఏదైనా సాధించగలమని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి రమణాచారి అన్నారు. స్వాతంత్య్ర శబ్ధ్దాన్ని నేడు చాలా మంది సరిగా ఉచ్ఛరించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. వనమాలి సంస్థ ఆధ్వర్యంలో ‘స్వాతంత్య్ర సంగ్రామం-తెలుగు వీరులు' శీర్షికన నిర్వహిస్తున్న మూడురోజుల నాటకోత్సవాలను ఆయన బుధవారం ప్రారంభించారు.

స్వాతంత్య్ర సమరయోధులు నాడు దేశం కోసం తపించారని అంటూ తపన ఉంటేనే ఫలితం ఉంటుందన్నారు.
ఆధ్యాత్మిక వేత్త రంగరాజన్ అధ్యక్షోపన్యాసం చేస్తూ.. నేడు స్కూళ్లలో దేశభక్తి గీతాలను పాడటం లేదని, యువతరం చరిత్రను మరిచిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక ఉద్యమకర్త దేవి మాట్లాడుతూ.. చరిత్ర తెలియకుండా భవిష్యత్తును నిర్మించలేరు..కాబట్టి చరిత్రను వక్రీకరించకుండా నేటి యువతకు తెలియజెప్పాలనే ఉద్దేశ్యంతో ఈ నాటకోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రదర్శించిన పాలెగాడు నాటకం తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాడి నేలకొరిగిన తొలి తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రను కళ్ళకు కట్టింది. దేవి రచన, దర్శకత్వంలో ప్రదర్శించిన ఈ నాటకంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బి.కన్నగా ప్రధాన పాత్ర పోషించి అలరించారు. అంతకు ముందు పలువురు ఆలపించిన అభ్యుదయ, దేశభక్తి గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

నాటకోత్సవం

నాటకోత్సవం

వనమాలి సంస్థ ఆధ్వర్యంలో ‘స్వాతంత్య్ర సంగ్రామం-తెలుగు వీరులు' శీర్షికన నిర్వహిస్తున్న మూడురోజుల నాటకోత్సవాలను తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి రమణాచారి బుధవారం ప్రారంభించారు.

నాటకోత్సవం

నాటకోత్సవం

ఈ సందర్భంగా ప్రదర్శించిన పాలెగాడు నాటకం తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాడి నేలకొరిగిన తొలి తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రను కళ్ళకు కట్టింది.

నాటకోత్సవం

నాటకోత్సవం

దేవి రచన, దర్శకత్వంలో ప్రదర్శించిన ఈ నాటకంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బి.కన్నగా ప్రధాన పాత్ర పోషించి అలరించారు.

నాటకోత్సవం

నాటకోత్సవం

ఆధ్యాత్మిక వేత్త రంగరాజన్ అధ్యక్షోపన్యాసం చేస్తూ.. నేడు స్కూళ్లలో దేశభక్తి గీతాలను పాడటం లేదని, యువతరం చరిత్రను మరిచిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
Vanamali Natakothsavam on Wednesday held at Ravindrabharathi, Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X