Vande Bharat: విశాఖ-భువనేశ్వర్ వందే భారత్ టైమింగ్స్ మార్పు-ఈ 5 స్టేషన్లలో ఇలా..!
విశాఖపట్నం-భువనేశ్వర్ మధ్య రాకపోకలు సాగించే వందే భారత్ ఎక్స్ ప్రెస్ (vande bharat express) రైలు సమయాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ రైలుకు ఐదు స్టేషన్లలో సమయాల్ని మారుస్తూ తూర్పు కోస్తా రైలు నిర్ణయం తీసుకుంది. మే 5వ తేదీ నుంచి ఈ కొత్త టైమింగ్స్ అమల్లోకి రాబోతున్నాయి. ప్రస్తుతానికి మాత్రం అమల్లో ఉన్న సమయాలే కొనసాగుతాయి. అలాగే ఈ ఐదు స్టేషన్లలో మాత్రమే టైమింగ్స్ మారుతున్నాయి. ఈ మార్పుల్ని ప్రయాణికులు గమనించాల్సి ఉంటుంది.
తూర్పు కోస్తా పరిధిలో రాకపోకలు సాగించే విశాఖపట్నం-భువనేశ్వర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ (నం.20841)కి మొత్తం ఐదు స్టేషన్లలో సమయాల్ని మారుస్తున్నారు. ఇందులో ఇచ్చాపురంలో ప్రస్తుతం ఉదయం 7.18గా ఉన్న సమయాన్ని 7.13కి మార్చారు. అలాగే పలాసలో ప్రస్తుతం ఉన్న ఉదయం 8.18 సమయాన్ని కాస్తా 8 గంటలకు మార్చారు. తిరుగు ప్రయాణంలో భువనేశ్వర్ -విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ ప్రెస్ (నం.20842)కి పలాసలో సమయాన్ని సాయంత్రం 6 గంటల నుంచి 5.50కి మార్చారు. అలాగే ఇచ్చాపురంలో సమయాన్ని 6.40 నుంచి 6.25కు మార్చారు.

అలాగే భువనేశ్వర్-విశాఖ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు ఖుర్దా రోడ్ లో 5.33గా ఉన్న సమయాన్ని మార్చలేదు. బలుగావ్ లో ఉదయం 6.23 నుంచి 6.13కు మార్చారు. బ్రహ్మపూర్ లో ఉదయం 7.05కు ఉన్న సమయాన్ని 6.55కు మార్చారు. తిరుగు ప్రయాణంలో విశాఖ-భువనేశ్వర్ వందే భారత్ రైలుకు బ్రహ్మపూర్ లో సమయాన్ని రాత్రి 7 గంటల నుంచి 6.40కు మార్చారు. బలుగావ్ లో 7.52గా ఉన్న సమయాన్ని 7.30కు మార్చారు. చివరిగా ఖుర్దా రోడ్ స్టేషన్ లో 8.57గా ఉన్న సమయాన్ని 8.30కు మార్చారు. మిగతా స్టేషన్ల సమయాల్లో మార్పులు లేవు.












Click it and Unblock the Notifications