చెంగు చాచి అడుగుతున్నా - జగన్ సమక్షంలో గీత కన్నీరు..!!

పిఠాపురం ఎన్నికల రాజకీయంలో బిగ్ ట్విస్ట్. జనసేనాని పవన్ పైన వైసీపీ అభ్యర్దిగా వంగా గీత పోటీ చేస్తున్నారు. హోరాహోరీగా పిఠాపురంలో ఎన్నికల రాజకీయం కొనసాగుతోంది. జగన్ ఈ ఎన్నికల్లో తన ప్రచారంలో చివరి సభను పిఠాపురంలో ఏర్పాటు చేసారు. జగన్ బస్సు పైన ప్రసంగానికి సిద్దమైన సమయంలో ఒక్క సారిగా వంగా గీత ఎమోషనల్ అయ్యారు. కన్నీటి పర్యంతం అవుతూ మాట్లాడారు. తన అంతిమ యాత్ర పిఠాపురంలోనే జరగాలంటూ ఉద్వేగానికి లోనయ్యారు.

వంగా గీత ఎమోషనల్
ఎన్నికల ప్రచారం ముగిసే వేళ పిఠాపురంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పవన్ కు మద్దతుగా మెగా హీరోలు...బుల్లి తెర ప్రముఖులు ప్రచారం హోరెత్తించారు. వైసీపీ అధినేత..సీఎం జగన్ పిఠాపురంలో ప్రచారం కోసం వచ్చారు.

Vanga Geetha Becomes Emotional in Pithapuram in presence of CM YS Jagan

ఇప్పటి వరకు తన గెలుపు ఖాయమని చెబుతూ వచ్చిన వంగా గీత ముఖ్యమంత్రి సమక్షంలో ఉద్వేగానికి లోనయ్యారు. కన్నీటి పర్యంతమవుతూ తనకు పిఠాపురంకు ఉన్న అనుబంధం వివరించారు. కొందరు తన పైన కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తనను అవమానిస్తున్నారంటూ కన్నీరు పెట్టుకున్నారు. తనను పిఠాపురం నుంచి దూరం చేయాలని చూస్తున్నారని చెప్పుకొచ్చారు.

చెంగుచాచి అడుగుతున్నా
తాను పిఠాపురం వదిలి వెళ్లనంటూ చెప్పుకొచ్చారు. తన అంతిమ యాత్ర కూడా పిఠాపురం నుంచే జరగాలంటూ వ్యాఖ్యానించారు. చెంగుచాచి అడుగుతున్నా..ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ వంగా గీత కన్నీటితో పిఠాపురం ఓటర్లను అభ్యర్దించారు. జఃగన్ ను చూపిస్తూ...బిడ్డ సాక్షిగా చెబుతున్నాను..గెలిపించండి..నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు. కుక్కటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటే మరోసారి పిఠాపురంలోనే జన్మిస్తానంటూ ఉద్వేగ పూరితంగా మాట్లాడారు. జగన్ వారించే ప్రయత్నం చేస్తున్నా..వంగా గీత కన్నీటిని తుడుచుకంటూ తన ప్రసంగం కొనసాగించారు.

పథకాలు కొనసాగాలంటే
ముఖ్యమంత్రి జగన్ తన ప్రసంగంలో అయిదేళ్ల కాలంలో తాను చేసిన కార్యక్రమాలను వివరించారు. టీడీపీ కూటమి కుట్ర పూరితంగా అవ్వా, తాతలకు ఇంటికి వచ్చే పెన్షన్లు నిలుపుదల చేయించారని ఆరోపించారు. జగన్ కు ఓటు వేస్తే పథకాల కొనసాగింపు...చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాల ముగింపు అని చెప్పుకొచ్చారు. రైతులు, మహిళలు, విద్యార్దుల కోసం పథకాల కోసం బటన్ నొక్కానని చెప్పారు. ఎన్నికల కోసం ఆ బటన్లు నొక్కలేదన్నారు. టీడీపీ కూటమి నేతలు కుట్రలు చేసి నిధులు అందకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. కూటమి పేదల పైన చేస్తున్న కుట్రలను గమనించాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+