'అమాయకురాలు.. రోజా రాజకీయ జీవితాన్ని జగన్ నాశనం చేస్తున్నారు'

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నగరి ఎమ్మెల్యే రోజా రాజకీయ జీవితాన్ని నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారని టిడిపి ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఆరోపించారు.

కడప షాక్‌కు కారణాలెన్నో: అలా ముందే జగన్ లీక్, చంద్రబాబు పైఎత్తు

ఆమె ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. రోజా తనపై చేసిన వ్యాఖ్యలతో మానసిక వేధనకు గురయ్యానని చెప్పారు. ఆమెపై తనకు వ్యక్తిగత కోపం, కక్ష లేదని చెప్పారు. క్షమాపణ చెబితే సమసిపోయే ఘటనను జగన్ పెద్దగా చేస్తున్నారన్నారు.

రోజాను టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు

రోజాను టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు

రోజా తనపై వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలతో తాను బాధపడ్డానని అనిత అన్నారు. రోజాను తాము వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం లేదని చెప్పారు. ఓ దళిత మహిళా ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పేందుకు ఆమెకు అంత అహంకారం ఎందుకో చెప్పాలన్నారు.

ప్లేటు మార్చిన రోజా.. ఏడాది పట్టిందా

ప్లేటు మార్చిన రోజా.. ఏడాది పట్టిందా

అసెంబ్లీలో జరిగిన ఘటనపై తనకు ఇచ్చిన సీడీ ఒకటి, తాము విడుదల చేసిన సీడీ మరొకటి అని రోజా చెబుతున్నారని, అది తెలుసుకునేందుకు రోజాకు ఏడాది పట్టిందా అని అనిత నిలదీశారు. తాను రోజా నుంచి క్షమాపణ కోరుతున్నానని చెప్పారు. అంతకుముందు తనకు షరతుల్లేని క్షమాపణ చెబుతానని చెప్పిన రోజా, ఆ తర్వాత మాత్రం ఎందుకు మాట మార్చారో చెప్పాలని నిలదీశారు.

రోజా రాజకీయ జీవితం..

రోజా రాజకీయ జీవితం..

తనను తెలుగుదేశం పార్టీ పావుగా వాడుకుంటుందన్న రోజా ఆరోపణలను అనిత కొట్టి పారేశారు. రోజానే జగన్ పావుగా వాడుకుంటున్నారని చెప్పారు. రోజా రాజకీయ జీవితం నాశనం చేసేందుకు జగన్ కంకణం కట్టుకున్నారని, టిడిపికి రోజాను టార్గెట్ చేయాల్సిన అవసరం, ఆమె రాజకీయ జీవితం నాశనం చేయాల్సిన అవసరం లేదని చెప్పారు.

రోజా అమాయకురాలిగా..

రోజా అమాయకురాలిగా..

రోజా తనకు క్షమాపణ చెప్పకుండా అడ్డుకొని రాద్దాంతం చేస్తున్నాడని అనిత మండిపడ్డారు. రోజా ఓ అమాయకురాలిగా.. జగన్ చెప్పింది మాట్లాడుతున్నారని వంగలపూడి అనిత అన్నారు. రోజాను ముందు పెట్టి చంద్రబాబు, లోకేష్‌లను జగన్ టార్గెట్ చేస్తున్నారన్నారు

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugudesam Party MLA Vangalapudi Anitha said that YSRCP chief YS Jaganmohan Reddy is destroying Nagari MLA Roja's political life.
Please Wait while comments are loading...