పకోడిగాడు, యదవ..: రాంగోపాల్ వర్మపై వంగవీటి రాధా తిట్ల దండకం
ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై వంగవీటి రాధకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
విజయవాడ: ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై వంగవీటి రాధకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డబ్బు కోసం వంగవీటి జీవితచరిత్రను కించపర్చేలా చిత్రీకరించి గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. డబ్బు కావాలని అడిగితే రంగా అభిమానులు చందాలు వేసుకుని ముఖాన కొట్టేవాళ్లమన్నారు.
సోమవారం ఉదయం వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసిన రాధాకృష్ణ నివాళులర్పించారు. తన తండ్రి ఆశయ సాధన కోసం కృషిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. రంగాను హత్య చేసిన వాళ్లు దర్జాగా తిరుగుతున్నా కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
అన్నీ తెలుసంటూ కోతలు కోసిన వర్మ.. డబ్బు కోసం తన తండ్రి జీవితాన్ని కించపరిచారని, ఇందుకు ఆయన మూల్యం చెల్లించుకోక తప్పదని వంగవీటి రాధ హెచ్చరించారు. అంతేగాక, పకోడిగాడు సినిమా తీశాడు, ఆ యదవ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వర్మ మూల్యం చెల్లించుకుంటారని, అందుకు టైమ్ వస్తుందని చెప్పారు. అది అందరికీ తెలుస్తుందని అన్నారు. రంగ అంటే ఎలాంటి నాయకుడో అందరికీ తెలుసని, ఒకరు చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.
కాగా, ఇప్పటికే వంగవీటి సినిమాపై రంగా అభిమానులు హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. కాపుల మనోభావాలను కించపరిచేలా 'వంగవీటి' సినిమాను చిత్రీకరించారని రంగా అభిమానులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. సినిమా టైటిల్ తోపాటు కాపులను కించపరిచే సన్నివేశాలను వెంటనే తొలగించాలని పేర్కొన్నారు.
వర్మ దిష్టిబొమ్మ దహనం
'వంగవీటి' చిత్రంలో వంగవీటి రంగా కుటుంబీకులను కించపరిచేలా అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని నిరసిస్తూ పశ్చిమగోదావరి జిల్లా తణుకులో కాపు సంఘ నాయకులు, కార్యకర్తలు, వంగవీటి రంగా అభిమానులు ఆందోళన చేపట్టారు. సినిమా ప్రదర్శిస్తున్న లక్ష్మీ థియేటర్ వద్ద దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ దిష్టిబొమ్మ దహనం చేశారు.
రంగా 28వ వర్థంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నేతలు పాలాభిషేకంచేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. రంగా కుటుంబీకులను కించపరిచేలా సినిమా తీసిన రామ్‌గోపాల్‌వర్మ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications