మా పార్టీలో వెధవలని వైసిపి నేతే అన్నారు: బాబుకు వంగవీటి రాధా దిమ్మతిరిగే కౌంటర్

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు వైసిపి నేత వంగవీటి రాధాకృష్ణ బుధవారం దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. టిడిపి అధినేత వ్యాఖ్యలు ఆయనకు ఆగ్రహం తెప్పించాయి.

విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు వైసిపి నేత వంగవీటి రాధాకృష్ణ బుధవారం దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. టిడిపి అధినేత వ్యాఖ్యలు ఆయనకు ఆగ్రహం తెప్పించాయి.

చదవండి: జగన్ ఆగ్రహం, తగ్గిన గౌతం రెడ్డి: వ్యాఖ్యల తొలగింపు, ఏ పార్టీ తీసుకోకపోవచ్చు!

దీంతో ఆయన మీడియా ముందుకు వచ్చారు. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. తప్పుడు పనులు చేస్తారని, అశాంతి సృష్టిస్తారని చంద్రబాబు వైసిపి నేత వంగవీటి రాధాకృష్ణ, వైసిపి నుంచి సస్పెండైన నేత గౌతం రెడ్డిపై వ్యాఖ్యానించారు.

చదవండి: పవన్ కళ్యాణ్‌పై విమర్శలు: సమాధానం ఇవ్వాలని తమ్ముడికి నాగబాబు

వారు జగన్ చేతిలో కీలుబొమ్మలు

వారు జగన్ చేతిలో కీలుబొమ్మలు

'తప్పుడు పనులు చేయడం, శాంతిభద్రతల సమస్యలు సృష్టించడం, మనల్ని తిరిగి విమర్శించడం వైసిపి నాయకులకు అలవాటు. కొందరు ప్రతిపక్షనాయకుడి చేతిలో కీలుబొమ్మలా మారారు. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి.' అని చంద్రబాబు అన్నారు.

మా పార్టీ వెధవలను ప్రోత్సహించిందని వైసిపి నేతనే అన్నారు

మా పార్టీ వెధవలను ప్రోత్సహించిందని వైసిపి నేతనే అన్నారు

అంతేకాదు, విజయవాడలో వైసిపికి చెందిన సదరు ఇద్దరు నాయకులు వాళ్లలో వాళ్లు గొడవపడి రోడ్డు మీదకు వచ్చి రాజధానిలో కల్లోలం సృష్టించే పరిస్థితి తెచ్చారని, వారిలో ఓ నాయకుడు మాట్లాడుతూ.. మా పార్టీ వెధవలను ప్రొత్సహించిందని చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు. ఆ పార్టీ అధినేత జగన్ అలాంటి వాడు కనుకే అలాంటి వారినే ప్రొత్సహిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. దీనిపై వంగవీటి రాధా ఆగ్రహం వ్యక్తం చేశారు.

వంగవీటి రాధా దిమ్మతిరిగే కౌంటర్

వంగవీటి రాధా దిమ్మతిరిగే కౌంటర్

దీంతో గురువారం వంగవీటి రాధా.. బాబుపై నిప్పులు చెరిగారు. ఒక మాజీ ఎమ్మెల్యే అయిన తనను, మాజీ మహిళా ఎమ్మెల్యే అయిన తన తల్లిని పోలీసులు బలవంతంగా లాక్కెళ్లినా చంద్రబాబు ఇంతవరకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.

తప్పు చేస్తే జగన్ చర్యలు, మరి మీ మాటేమిటి

తప్పు చేస్తే జగన్ చర్యలు, మరి మీ మాటేమిటి

వాస్తవాలను తెలుసుకోకుండా చంద్రబాబు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని వంగవీటి రాధా అన్నారు. వైసీపీలో ఎవరు తప్పు చేసినా వెంటనే చర్యలు తీసుకుంటారన్నారు. వంగవీటి రంగా గురించి తమ నేత ఒకరు తప్పుగా మాట్లాడితే, జగన్ వెంటనే చర్యలు తీసుకున్నారన్నారు.

టిడిపి నేతలు దాడులకు దిగినా పట్టించుకోరే

టిడిపి నేతలు దాడులకు దిగినా పట్టించుకోరే

ఇదే సమయంలో టిడిపి నేతలు, కార్యకర్తలు ఏం చేసినా చంద్రబాబు పట్టించుకోవడం లేదని రాధా మండిపడ్డారు. కొందరు టిడిపి ప్రజాప్రతినిధులు అధికారులపై దాడులకు కూడా దిగారని, అయినా చంద్రబాబు వారిని ఏమీ అనలేదన్నారు.

చంద్రబాబును జేసీ తిట్టినా ఏం అనలేని స్థితి

చంద్రబాబును జేసీ తిట్టినా ఏం అనలేని స్థితి

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సీఎం చంద్రబాబునే విమర్శించినా పట్టించుకోని దుస్థితి టిడిపి ఉందని గట్టి కౌంటర్ ఇచ్చారు వంగవీటి రాధా. మొన్న జరిగిన విషయాన్ని తెలుసుకోకుండానే చంద్రబాబు సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారన్నారు.

ఆ రోజేం జరిగిందంటే..

ఆ రోజేం జరిగిందంటే..

ప్రెస్ మీట్ కు వెళుతుండగా తనను పోలీసులు అడ్డుకున్నారని, ఆ తర్వాత తనను, తన తల్లిని రోడ్లపై ఈడ్చుకుంటూ వెళ్లారని రాధా అన్నారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు జరిగిన ఘటనపై విచారణ జరిపించాలని, చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన అధికారులను శిక్షించాలన్నారు. అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+