దివాళకోరుతనం, అవగాహన రాహిత్యం: జగన్‌పై వర్ల
ప్రకాశం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకంలో మీడియాతో మాట్లాడుతూ.. వైయస్ జగన్ చేస్తున్న ఆరోపణలు ఆయన రాజకీయ అవగాహన రాహిత్యానికి, దివాళకోరుతనానికి నిదర్శనమని అన్నారు.
42రోజులు దాటని టిడిపి పాలనపై జగన్ ఇష్టారీతిగా మాట్లాడటం సరికాదన్నారు. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 167 సీట్లు కాదు కదా.. ఒక్క సీటు కూడా వచ్చేది కాదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతుల కడగండ్లు తీర్చడానికి ఏపి సిఎం చంద్రబాబు రుణమాఫీని ప్రకటించారని పేర్కొన్నారు. సిఎం పేషీలో మరమ్మతులకు ఖర్చు చేసిన స్వల్ప మొత్తాన్ని భూతద్దంలో చూపించడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దివాళకోరుతనానికి నిదర్శనమని వర్ల విమర్శించారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శిక్షణ తరగతులకు గైర్హాజరైన వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్న పార్టీలో నాయకులు, సమావేశాలకు అయిన స్వల్ప మొత్తాన్ని కూడా విమర్శించడం హేయమని అన్నారు.
రాష్ట్రంలో పదేళ్లుగా జరిగిన భూముల అక్రమాలపై మంత్రివర్గ ఉససంఘం విచారణ జరుపుతుండటంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబుకు భయం పట్టుకుందని వర్ల రామయ్య అన్నారు. ఏపిఐఐసీ ఛైర్మన్‌గా అంబటి చేసిన అక్రమాలను బయటపెడతామని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓ దొంగల ముఠా అని ఆరోపించిన ఆయన, ఆ ముఠా నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని వర్ల రామయ్య అన్నారు.












Click it and Unblock the Notifications