పవన్ కళ్యాణ్ కోసం వరుణ్ తేజ్ ఎంట్రీ.. పిఠాపురంలో మెగా ప్రిన్స్ హంగామా.. ఎప్పుడంటే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి పవన్ కళ్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ రంగంలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం సాధించాలని బలంగా కోరుకుంటున్న మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ కోసం చిరంజీవి ప్రచారం చేస్తానని ప్రకటించడంతో మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ విషయంలో ఎంత కమిట్మెంట్ తో ఉన్నారో అర్థమవుతుంది.
పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారం
ఇక ఇదే క్రమంలో రేపు పిఠాపురంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం ఎన్నికల ప్రచారాన్ని చేయనున్నారు. పవన్ కళ్యాణ్ ను ఓడించాలని వైసీపీ గట్టిగానే ప్లాన్ చేసి అక్కడ వంగ గీతను రంగంలోకి దింపింది. పవన్ కళ్యాణ్ ను దీటుగా ఎదుర్కోవడానికి, పిఠాపురం నియోజకవర్గంలో ఆయనను ఓడించడానికి జగన్ ప్రత్యేకమైన దృష్టి పెట్టారు.

పవన్ కోసం ఇప్పటికే ప్రచారంలో జబర్దస్ట్ నటులు
ఈ క్రమంలో గత ఎన్నికల మాదిరిగా కాకుండా ఈసారి పవన్ కళ్యాణ్ విజయం కోసం ఆయన అభిమానులు, ఆయన కుటుంబం రంగంలోకి దిగింది. ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో హైపర్ ఆది, గెటప్ శీను, ఆర్కే నాయుడు, జానీ మాస్టర్ వంటివారు పవన్ కళ్యాణ్ కోసం ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. రేపు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా పిఠాపురంలో రంగంలోకి దిగుతున్నారు.
బాబాయ్ కోసం వస్తున్న వరుణ్ తేజ్ ఏం చెప్తారో
తన బాబాయ్ తన జీవితాన్ని రాజకీయాల కోసం ఎంత త్యాగం చేశారో, సుఖంగా బ్రతకాల్సిన జీవితాన్ని వదులుకొని ఏపీ ప్రజల కోసం బాబాయ్ ఎంత కష్ట పడుతున్నారో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పి, వాళ్ళందరిని పవన్ కళ్యాణ్ కు ఓటేయాలని కోరడానికి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ శనివారం రోజు ప్రచారం చేయబోతున్నారు. ఈ విషయాన్ని జనసేన తో పాటు నాగబాబు కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
రేపు (27-04-24) పిఠాపురంలో వరుణ్ తేజ్ గారి ప్రచారం!#PawanKalyanWinningPithapuram#PawanKalyan #Pithapuram #VoteForGlass #VarunTej pic.twitter.com/3MyCnbd2b3
— JanaSena Pithapuram (@pithapuramjsp) April 26, 2024
మెగా ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ అంటే ఎనలేని ప్రేమ
ప్రస్తుతానికి మెగా ఫ్యామిలీ నుండి వరుణ్ తేజ్ మాత్రమే ప్రచారానికి రానున్నట్టు తెలుస్తుండగా, పోలింగ్ దగ్గర పడే సమయానికి మెగా హీరోలు మరింతమంది పవన్ కళ్యాణ్ కోసం ప్రచారానికి వస్తారని జనసేన నేతలు భావిస్తున్నారు. మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ అంటే అందరికీ విపరీతమైన ప్రేమ. రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్ ఇలా ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ పట్ల విపరీతమైన ప్రేమను చూపిస్తూ ఉంటారు.
పిఠాపురంలో బాబాయ్ కోసం అబ్బాయ్
బాబాయ్ సిద్ధాంతాలు, ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయని అనేక సందర్భాలలో వరుణ్ తేజ్, రామ్ చరణ్ తేజ్ చెప్పారు. ఈ క్రమంలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రేపు పిఠాపురంలో బాబాయ్ గురించి ఏం చెప్తాడు అన్నది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది.












Click it and Unblock the Notifications