Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు కట్టిందెవరు ? జగన్- లోకేష్ క్రెడిట్ వార్..!

ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు (Veligonda Project) నిర్మాణానికి దశాబ్దాలుగా ప్రయత్నాలు జరిగాయి. టీడీపీ-కాంగ్రెస్-టీడీపీ-వైఎస్సార్సీపీ-కూటమి ఇలా ఎన్నో ప్రభుత్వాలు మారాయి. చివరికి వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ పూర్తయి ఇవాళ ప్రారంభోత్సవానికి రంగం సిద్దమైంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు మొత్తం నేనే కట్టాను, పూర్తి చేశాను అని ఏ వ్యక్తీ, ఏ ప్రభుత్వమూ చెప్పుకోలేని పరిస్ధితి. తాము చేసినంత వరకూ చెప్పుకోవడంలో తప్పులేదు, కానీ ప్రాజెక్టు ప్రారంభోత్సవం వేళ క్రెడిట్ వార్ లో భాగంగా అంతా మేమే అని చెప్పుకుంటూ అధికార కూటమి, విపక్ష వైఎస్సార్సీపీ రాజకీయాలు మొదలుపెట్టేశాయి.

El Nino: ఎల్ నినోపై జగన్ కు సర్కార్ కౌంటర్..! వర్షాల్లేకపోయినా ఖరీఫ్ సాగు..!
El Nino: ఎల్ నినోపై జగన్ కు సర్కార్ కౌంటర్..! వర్షాల్లేకపోయినా ఖరీఫ్ సాగు..!

ఇందులో భాగంగా ముందుగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ (ys jagan).. వెలిగొండ ప్రాజెక్టుపై ఓ ట్వీట్ చేశారు. ఇందులో శిలాఫలకం చంద్రబాబుది, సంకల్పం, సమగ్ర నిర్మాణం వైఎస్సార్ ది, కీలక జంట సొరంగాల పూర్తి మా ప్రభుత్వానిది, ఇప్పుడు జరుగుతున్నది మీ క్రెడిట్ చోరీ అంటూ జగన్ ఆరోపించారు. దీనికి ఆధారంగా ఏ సంవత్సరంలో ఏయే పనులు పూర్తయ్యాయో వివరిస్తూ గణాంకాలను కూడా జగన్ తన ట్వీట్ లో పోస్టు చేశారు.

Veligonda Project Triggers Fresh Credit War Between YS Jagan and Nara Lokesh

పోలవరం లోపాల పుట్ట- హైకోర్టు ముందు స్వయంగా వాదించబోతున్న మాజీ ఐపీఎస్ ..!
పోలవరం లోపాల పుట్ట- హైకోర్టు ముందు స్వయంగా వాదించబోతున్న మాజీ ఐపీఎస్ ..!

దీనికి మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఇవాళ కౌంటర్ ఇచ్చారు. విజువల్స్ క్లోజ్ గా చూస్తే 2024లో జగన్ నీళ్లు లేకుండా నీటిపారుదల ప్రాజెక్టును ప్రారంభించి చరిత్ర సృష్టించారని తెలిపారు. తద్వారా ఆయన ఫేక్ ప్రారంభోత్సవం చేశారని పేర్కొన్నారు. అప్పట్లో వైఎస్ జగన్ వెలిగొండ ప్రాజెక్టులో జంట సొరంగాలను పూర్తి చేసి ప్రారంభించడాన్ని ప్రస్తావిస్తూ లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో జగన్ సొరంగాలు పూర్తి చేసి ప్రారంభించిన విషయాన్ని పరోక్షంగా అంగీకరించిన లోకేష్.. అందులో నీళ్లు రాలేదని గుర్తుచేశారు. వెలిగొండ ప్రాజెక్టును చంద్రబాబు ప్రారంభిస్తున్న వేళ జగన్, లోకేష్ ట్వీట్లు మాత్రమే కాదు వైఎస్సార్సీపీ, కూటమి పార్టీల క్యాడర్ కూడా సోషల్ మీడియాలో వార్ కు దిగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+