పద్ధతులుంటాయి, హైద్రాబాద్‌తో పోల్చుతారా, లెక్కచెప్పు: బాబుకు వెంకయ్య షాక్
విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా, కేంద్రం ఇచ్చిన నిధులు, నవ్యాంధ్ర రాజధాని అమరావతిని హైదరాబాద్, సింగపూర్‌తో పోల్చడం వంటి తదితర అంశాల పైన కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు గురువారం నాడు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ఈ సందర్భంగా వెంకయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి అన్ని విధాలా కేంద్రం సహకరిస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి అడిగినంత ఇవ్వకపోవచ్చు కానీ ఏపీకి చాలానే ఇస్తున్నామని చెప్పారు. ఏపీకి కేంద్రం నుంచి నిధులు విడుదల కావడం లేదన్నది నిజం కాదన్నారు.

మీకు కేంద్రం సహకారం కావాలి, లెక్కలు చెప్పాలి
ప్రత్యేక హోదా, నిధుల గురించి మాట్లాడుతూ.. పాలనాపరంగా కొన్ని పద్ధతులు ఉంటాయని చెప్పారు. ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం ఉందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఒక్కటి ఇస్తే సరిపోదని, కేంద్రం సహకారం కూడా ఉండాలని వెంకయ్య వ్యాఖ్యానించడం గమనార్హం.
ఏపీకి ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం ఉందని ఆర్థిక సంఘం సిఫార్సు చేసిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగినంత ఇవ్వకపోయినప్పటికీ ఏపీకి అధికంగానే ఇస్తున్నామని చెప్పారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన లెక్కలను చూపించాలన్నారు.
హైదరాబాద్, సింగపూర్‌తో పోల్చితే ఎలా
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని హైదరాబాదుతోనో, సింగపూర్‌తోనే పోల్చితే ఎలాగని వెంకయ్య నాయుడు పరోక్షంగా బాబును ప్రశ్నించారు. కొత్త రాజధానిని వాటితో పోల్చాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. అసలు హైదరాబాదుతో ఎందుకు పోటీ పడాలని ప్రశ్నించారు.
హైదరాబాదులా అంటే పాలనను కేంద్రీకరిస్తారా అని చంద్రబాబుకు షాకిచ్చారు. కొత్త రాష్ట్రంలో వికేంద్రీకరణ జరగాలన్నారు. రాజధాని విషయమై చంద్రబాబు ఆలోచన గురించి అడిగితే.. ఆయన ఆలోచన ఆయనదని, ఆయన ముఖ్యమంత్రి అన్నారు. రాజధానికి కేంద్రం సహకారం తప్పకుండా ఉంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications