విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయవాడలో వెంకయ్యకు చేదు అనుభవం

|
Google Oneindia TeluguNews

విజయవాడ: కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడికి విజయవాడలో శనివారం చేదు అనుభవం ఎదురైంది. మహిళా పారిశ్రామిక వేత్తలతో సదస్సులో పాల్గొనేందుకు గేట్ వే హోటల్‌కు ఆయన వచ్చారు. అదే సమయంలో హోటల్ బయట వామపక్షాల ఆధ్వర్యంలో భారీస్థాయిలో ఆందోళన నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇప్పించడంలో వెంకయ్య విఫలం అయ్యారంటూ నినదించారు. బిజెపిది మాటల ప్రభుత్వం తప్ప, చేతల ప్రభుత్వం కాదని సిపిఎం నాయకుడు బాబూరావు ఆరోపించారు. ఎన్నికల ముందు పార్లమెంటులో ఏపీకి ఐదేళ్లు కాదు.. పదేళ్ల ప్రత్యేకహోదా కావాలని డిమాండు చేశారని, మోడీతో కలిసి ప్రచారంలో కూడా చెప్పారని ఆయన గుర్తుచేశారు.

Venkaiah Naidu faced bitter experience

అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టపరంగా ఇవ్వాల్సిన రాయితీలు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఆంధ్రావాడినని చెప్పుకోడానికి వెంకయ్య సిగ్గుపడాలని అన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసి కాంగ్రెస్ మోసం చేస్తే, బిజెపి, టిడిపిలు కలిసి రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా, ఇతర హక్కులు ఇవ్వకుండా నాశనం చేస్తున్నాయని ఆరోపించారు.

వెంకయ్య రోజుకో మాట మారుస్తున్నారని, రాష్ట్రానికి ప్రత్యేకహోదా అడిగే హక్కు లేదన్న ఆయనకు.. ఓట్లడిగే హక్కు లేదని స్పష్టం చేశారు. కాగా, ఆందోళన చేస్తున్న వామపక్షాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

English summary
Union Minister Venkaiah Naidu on Saturday faced bitter experience from CPM leaders in Vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X