అసెంబ్లీకి వచ్చి చంద్రబాబును కలిసిన వేణుమాధవ్

అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చిన వేణు మాధవ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ఇతర శాసన సభ్యులను కలిశారు.
వేణు మాధవ్ మిమిక్రీ చేస్తాడనే విషయం తెలిసిందే. అతను చదువుకునే రోజుల్లో ఓ సందర్భంలో టాకింగ్ డాల్‌లో ప్రోగ్రామ్ చేశాడు. దీనిని చూసిన నాటి కోదాడ శాసన సభ్యులు చందర రావు అతడిని భువనగిరిలో తెలుగుదేశం పార్టీ సమావేశానికి తీసుకు వెళ్లారు. అలా స్వర్గీయ నందమూరి తాకర రామారావు మహానాడులో వేణు మాధవ్ ప్రదర్శన ఇచ్చారు.
అది ఎన్టీఆర్‌కు బాగా నచ్చింది. మీ సేవలు మాకు అవసరం బ్రదర్ అంటూ వేణు మాధవ్‌ను హిమయత్ నగర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చేర్చుకున్నారు. అక్కడి నుండి అసెంబ్లీలోని తెలుగుదేశం పార్టీ లెజిస్లేటివ్ కార్యాలయంలోకి చేర్చారు.












Click it and Unblock the Notifications