చంద్రబాబు అడ్డాలో ఫస్ట్ వికెట్, వైసీపీ అండతో రెడ్డికి ఆ పదవి, కుప్పంలో కౌంట్ డౌన్ !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు త్వరలో ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఐఏఎస్, ఐపీఎస్, విద్యాశాఖతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల్లోని పని చేస్తున్న అధికారులు జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా పని చెయ్యడంతో వారికి ఉన్నత పదవులు వరించాయి. ఇప్పుడు చంద్రబాబు అడ్డా కుప్పంలో ఓ పెద్ద వికెట్ పడటం హాట్ టాపిక్ అయ్యింది.

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ద్రావిడ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. 1997 అక్టోబర్ 20వ తేదీన ద్రావిడ విశ్వవిద్యాలయం ప్రారంభం అయ్యింది. త్రిరాష్ట్ర అంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు కూడలి అయిన కుప్పంలో వెయ్యి ఎకరాల్లో ద్రావిడ విశ్వవిద్యాలయం ప్రారంభించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాలం, తుళి, ఇంగ్లీష్ బాషల్లో అనువాదం జరుగుతుంది. ద్రావిడ యూనివర్శిటీ ఏర్పాటు చెయ్యాలని మూడు రాష్ట్రాలు పోటీపడటంతో చివరికి చంద్రబాబు ఆయన తెలివితేటలు ఉపయోగించి కుప్పంకు ద్రావిడ యూనివర్శి రావడానికి కారణం అయ్యారు.

Venugopal Reddy resigned from the post of Dravida University registrar in Chandrababu s constituency

అంతరించిపోతున్న చిన్నచిన్న బాషలను కాపాడటం కోసం చిత్తూరు, కోలారు, క్రిష్ణగిరి జిల్లాల్లో పరిశోధనలు చేసి వాటి రికార్డులను ద్రావిడ యూనివర్శిటీలో భద్రపరుస్తున్నారు. నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన ద్రావిడ యూనివర్శిటీలో రాజకీయాలు మొదలైనాయి. జగన్ సీఎం అయిన తరువాత కుప్పంను కంట్రోల్ లోకి తెచ్చుకోవాలని ప్రయత్నించిన విషయం బహిరంగ సత్యం. ఇక కుప్పంలో అన్నీతానై చేసిన మాజీ మంత్రి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కూడా కుప్పం మీద పట్టుబిగించారు.

ఇదే సమయంలో కుప్పంలోని ద్రావిడ యూనివర్శిటీలో కీలకపదవులు వైసీపీకి, రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చేశారు. ద్రావిడ యూనివర్శిటీలో తెలుగు అధ్యాపకుడిగా పని చేస్తున్న ఆచార్య ఏకే వేణుగోపాల్ రెడ్డిని రిజిస్టార్ గా నియమించారు. 2021 జులై 15వ తేదీన ద్రావిడ యూనివర్శిటీ రిజిస్టార్ గా వేణుగోపాల్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ద్రావిడ యూనివర్శిటీలో వైసీపీ మార్కు రాజకీయాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి.

Venugopal Reddy resigned from the post of Dravida University registrar in Chandrababu s constituency

చంద్రాబు నాయుడు సొంత నియోజక వర్గం కుప్పంలో ఇలాంటి రాజకీయాలు జరగడం టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తున్న సందర్బంలో మనకు ఎదురుగాలి వీస్తుందని ఆందోళనకు గురైన వేణుగోపాల్ రెడ్డి ద్రావిడ యూనివర్శిటీ రిజిస్టార్ పదవికి రాజీనామా చేశారు. వీసీ ఆచార్య మధుజ్యోతికి ఈమోయిల్ ద్వారా రాజీనామా లేఖ పంపించారు.

తరువాత వేణగోపాల్ రెడ్డి వీసీకి ఫోన్ చేసి తన రాజీనామాను ఆమోదించాలని మనవి చేశారని తెలిసింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లోని విద్యాశాఖలో, అదికాకుండా చంద్రాబాబు అడ్డా కుప్పంలో రిజిస్టార్ పదవికి ఒకరు రాజీనామా చెయ్యడంతో విద్యాశాఖలో ఫస్ట్ వికెట్ పడినట్లు అయ్యింది. కుప్పంలో పోలీసు అధికారులతో పాటు ప్రతిశాఖలోని అధికారుల మీద బదిలి వేటు పడుతుందని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+