ముద్రగడ తప్పా, ఒప్పా: పవన్ కల్యాణ్‌ను మరోసారి లాగిన విహెచ్
రాజమండ్రి: కాపు నేత ముద్రగడ పద్మనాభం దీక్ష నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తెలంగాణ కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపులకు అన్యాయం జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
కాపుల రిజర్వేషన్ల కోసం ముద్రగడ చేసేది తప్పో ఒప్పో పవన్ కల్యాణ్ చెప్పాలని హనుమంతరావు డిమాండ్ చేశారు. ముద్రగడ దీక్షపై చిరంజీవి ఇటీవల స్పందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన అధినేతగా ఉన్న పవన్ ఇప్పటివరకు ఎలాంటి స్పందనా కనబరచకపోవడంతో వీహెచ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు అర్థమవుతోంది

ఇదిలావుంటే, కాపుల కోసం ఎవరో అడిగారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేయడం లేదని, ఎన్నికల్లో హామీ ఇచ్చారు కాబట్టి చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ కాపు కార్పోరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ అన్నారు. తుని ఘటనలో అరాచకం సృష్టించివారిని ప్రభుత్వానికి అప్పగిస్తాని గతంలో ముద్రగడ పద్మనాభం చెప్పిన విషయాన్ని ఆయన శనివారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుర్తు చేశారు.
కాపుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పేదకాపు విద్యార్థులను అన్ని విధాల ఆదుకుంటామని ఆయన చెప్పారు. సివిల్స్ శిక్షణ తీసుకునే అభ్యర్థులకు నెలకు రూ.10 వేలు, ఢిల్లీలో శిక్షణ తీసుకునే వారికి మాత్రం వసతి సౌకర్యం కూడా కల్పిస్తామని ఆయన తెలిపారు. వార్షిక ఆదాయం రూ.6 లక్షలలోపు ఉన్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుందన్నారు.
కాపుల అభివృద్ధికి కాపు సంఘాల సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. విదేశాల్లో చదువుకునే కాపు విద్యార్థులకు కార్పొరేషన్ ద్వారా 10లక్షలు మరో 10 లక్షలు బ్యాంకుల ద్వారా అందిస్తామన్నారు. బలిజ, తెలగ, వంటరి కులస్తులను కూడా అన్నివిధాల ఆదుకుంటామని రామానుజయ వెల్లడించారు.
-
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications