బాబుపై సీబీఐ విచారణ కావాలి: రాజ్‌నాథ్‌కు వీహెచ్
ఢిల్లీ: ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు పాత్ర పైన సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంత రావు శనివారం డిమాండ్ చేశారు. ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను కలిశారు. ఓటుకు నోటు వ్యవహారాన్ని సీబీఐచే విచారణ జరిపించాలన్నారు.

రేవంత్ కేసులో చంద్రబాబు ముద్దాయి
నోటుకు ఓటు సంఘటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముద్దాయేనని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఆరోపించారు. ఇటీవల మరణించిన పెందుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వేగి సాంబశివరావు కుటుంబీకులను పరామర్శించేందుకు శుక్రవారం పెందుర్తి వచ్చారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో దోచుకున్న సొమ్ముతో తెలంగాణ రాష్ట్రంలో పార్టీని అభివృద్ధి చేసుకుంటున్నారన్నారు. ఓటుకు నోటు కేసులో అసలు నిందితుడు రేవంత్ రెడ్డి కాదని, సీఎం చంద్రబాబేనన్నారు.
ఎప్పటికైనా చంద్రబాబు శిక్షను అనుభవించక తప్పదన్నారు. అవినీతి పాలనలో చంద్రబాబు నూటికి రెండువందల మార్కులు సంపాదించారని ఎద్దేవా చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న బొత్స సత్యనారాయణను పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని ఆయన సమర్ధించుకున్నారు.
చాలా కాలంగా బొత్స పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నది సుస్పష్టమని అన్నారు. ఈ విషయంలో పార్టీ అధిష్టానం స్పందించి చర్యలు తీసుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో నాయకులకు కొదవ లేదని పాతతరం పోతే కొత్త తరం ముందుకు వస్తుందన్నారు.












Click it and Unblock the Notifications