విడదల రజనీకి టీడీపీ కొత్త అస్త్రం - బిగ్ టర్న్..!!

ఏపీలో పలు నియోజకవర్గాల్లో హోరా హోరీ పోరు సాగుతోంది. కొందరు ముఖ్య నేతల నియోజకవర్గాల ఫలితం పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మంత్రి రజనీ పోటీ చేస్తున్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పోటీ ఆసక్తి కరంగా మారింది. అక్కడ గెలుపు రజనీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. టీడీపీ కూటమి విజయం ఖాయం అనుకుంటున్న సమయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రజనీ కొత్త వ్యూహాలతో లెక్కలు మారుతున్నాయి.

మారుతున్న లెక్కలు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సమీకరణాలు మారుతున్నాయి. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోకు ఆశించిన స్పందన కనిపించ లేదు. కూటమిలో భాగస్వాములుగా ఉన్న జనసేన, బీజేపీ నుంచి మద్దతు దక్కలేదు. నామ్ కే వాస్తేగా అన్నట్లుగా ఆ రెండు పార్టీల శ్రేణులు కనిపించాయి. టీడీపీ నుంచి మాధవి పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో టీడీపీ సీట్లు ఆశించి భంగపడిన నేతల నుంచి మాధవికి పూర్తి స్థాయి సహకారం అందటం లేదు. రజనీకి ఎన్నికల అనుభవం ప్రస్తుతం వరంగా మారింది. నియోజకవర్గంలో బీసీ ఓటర్లను తన వైపు తిప్పుకోవటంతో పాటుగా అనూహ్యంగా టీడీపీ మద్దతుగా నిలుస్తున్న నేతల నుంచి మద్దతు తీసుకోవటంలో సక్సెస్ అవుతున్నారు.

Vidadala Rajini strategic move in Guntur west to fix TDP leads to new Expections

ప్రత్యర్ధి పార్టీల పై గురి
టీడీపీలోని కొందరు నేతలను జగన్ సమక్షంలో వైసీపీలోకి తీసుకొచ్చిన రజనీ..తాజాగా నగరానికి చెందిన జనసేన నేతలను వైసీపీలోకి ఆహ్వానించారు. జనసేన నేతలు రజనీకి మద్దతు ప్రకటించారు. వారు అధికారికంగా వైసీపీ కండువా కప్పుకొనేందుకు సిద్దమయ్యారు. టీడీపీ అభ్యర్ది పూర్తిగా పార్టీ నేతలు..సీనియర్ల మద్దతు పైనే ఆధారపడి ప్రచారం చేస్తున్నారు. రజనీ వ్యూహాత్మకంగా స్థానికంగా ఉన్న తటస్థులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మౌలిక సౌకర్యాల కల్పనపై వారికి తన విజన్ ఏంటో స్ఫష్టం చేస్తున్నారు. ఆరోగ్య శాఖ మంత్రిగా తన ట్రాక్ రికార్డును వివరిస్తూ గుంటూరు పశ్చిమంలో తీసుకొచ్చే మార్పుల గురించి వారికి వివరించి మద్దతు తీసుకుంటున్నారు.

వ్యూహాత్మకంగా అడుగులు
2014,2019 లో గుంటూరు పశ్చిమం నుంచి టీడీపీ విజయం సాధించింది. కానీ, నియోజకవర్గంలో వచ్చిన మార్పులు లేవు. నియోజవర్గాన్ని పట్టించుకోలేదు. ఎన్నికల సమయంలో మాత్రమే టీడీపీ నేతలు ప్రజల ముందుకు వస్తున్నారనే ప్రచారం ఆ పార్టీ నేతలకు నష్టం చేస్తోంది. దీంతో..పబ్లిక్ మూడ్ గుర్తించిన రజనీ..వారి సమస్యల పైన స్పష్టమైన హామీ ఇస్తూనే...కూటమి నేతలను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని వర్గాల మద్దతు పొందేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. నేతలను నేరుగా జగన్ సమక్షంలో పార్టీలోకి తీసుకురావటం ద్వారా వారికి మరింతగా ప్రాధాన్యత దక్కుతోంది. ప్రతీ నిర్ణయంలో రజనీ వేస్తున్న వ్యూహాత్మక అడుగులతో విజయం పైన ధీమా పెరగటానికి కారణాలుగా నిలుస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+