అప్పుడు అచ్చెన్న, ఇప్పుడు బుచ్చన్న ; 2024 నాటికి పార్టీ లేదు బొక్క లేదు : సాయిరెడ్డి సంచలనం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపిలో తాజాగా అసంతృప్తుల పర్వం కొనసాగుతున్న సమయంలో సందట్లో సడేమియా అంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చంద్రబాబును, నారా లోకేష్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే అనేకమార్లు టిడిపి పనైపోయిందని, ఇటీవల జరిగిన ఎన్నికలతో కూడా ప్రజలు అదే తీర్పు ఇచ్చారని, ఏపీలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిందని వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డికి ఇప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎపిసోడ్ తో టిడిపిని టార్గెట్ చేయడానికి మరో అవకాశం దొరికినట్లయింది.

బుచ్చయ్య చౌదరి చెప్పిన ఆసక్తికర నిజాలు .. సాయిరెడ్డి ట్వీట్

బుచ్చయ్య చౌదరి చెప్పిన ఆసక్తికర నిజాలు .. సాయిరెడ్డి ట్వీట్

తాజాగా బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న వార్తల నేపథ్యంలో బుచ్చయ్య చౌదరి ఆసక్తికర నిజాలు చెప్పారంటూ విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. అప్పుడు అచ్చెన్న, ఇప్పుడు బుచ్చన్న అంటూ టీడీపీపై వారు చేసిన విమర్శలను గుర్తు చేశారు . బుచ్చయ్య చౌదరి రిజైన్ చేస్తారో లేదో గాని ఆయన చెప్పిన నిజాలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి అంటూ పేర్కొన్న సాయి రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీలోకి లాక్కుని పొరపాటు చేశారని తాను చంద్రబాబును తప్పుబట్టానని గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారని ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

ప్రజలు బాబును ఐదేళ్లు తరిమారు సూపర్ తీర్పు కదా

ప్రజలు బాబును ఐదేళ్లు తరిమారు సూపర్ తీర్పు కదా

వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టిడిపిలో లాక్కొని పొరబాటు చేశారని నిలదీసినందుకు చంద్రబాబు తనతో రెండేళ్లు మాట్లాడలేదని బుచ్చయ్య చౌదరి చెప్పారంటూ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ప్రజలు బాబును ఐదేళ్లు తరిమారు సూపర్ తీర్పు కదా అంటూ విజయ సాయి రెడ్డి ఎద్దేవా చేశారు. తాజా పరిణామాల సందర్భంగా నారా లోకేష్ ని టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి పార్టీలో లోకేశాన్ని ఎవరూ గుర్తించడం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నువ్వు కాలు పెట్టిన చోట సొంత పార్టీలో లుకలుకలు

నువ్వు కాలు పెట్టిన చోట సొంత పార్టీలో లుకలుకలు

ప్రజల మధ్యకి వెళ్లడం, పార్టీని బలోపేతం చేయడం అంటే శవయాత్రలు కాదు మాలోకం అంటూ సెటైర్లు వేశారు. ఏ సమస్య లేని దగ్గర నలుగురిని వెంటేసుకుని అలజడి చేసి రాగానే పరిస్థితి మారదు అంటూ లోకేష్ ను టార్గెట్ చేశారు. ఇదే సమయంలో నువ్వు కాలు పెట్టిన చోట సొంత పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి అంటూ ఎద్దేవా చేశారు. నాయకుడిగా నిన్ను ఎవరూ గుర్తించడం లేదు, తెలుస్తోందా ..అంటూ లోకేష్ పై ధ్వజమెత్తారు విజయసాయిరెడ్డి.అంతేకాదు అంతకుముందు మరోమారు టిడిపి పరిస్థితి అధ్వానంగా ఉందంటూ తండ్రి కొడుకుల దెబ్బకు టిడిపి మటాష్ అంటూ షాకింగ్ ట్వీట్ చేశారు.

తండ్రి కొడుకులు దెబ్బకు టీడీపీ మటాష్

తండ్రి కొడుకులు దెబ్బకు టీడీపీ మటాష్

పార్టీ లేదు బొక్క లేదని అచ్చెన్న చెబితే వినలేదని ఇప్పుడు బుచ్చన్న కూడా అదే చెబుతున్నారని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. తండ్రి కొడుకులు దెబ్బకు టీడీపీ మటాష్ అంటూ, 2024 నాటికి పార్టీ లేదు బొక్క లేదు అంటూ షాకింగ్ ట్వీట్ చేశారు. తెలుగుదేశం పార్టీ లో తాజాగా నెలకొన్న అసమ్మతి నేపథ్యంలో తెలుగు తమ్ముళ్ళ వ్యాఖ్యలను పేర్కొంటూ, టిడిపి కనుమరుగవుతోంది అంటూ విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా చోటుచేసుకున్న తాజా పరిణామాలు అధినేత చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారితే, మరోపక్క ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ అధికార పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీని,చంద్రబాబును మరింత ఇబ్బంది పెడుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+