Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ముందు మునిగేది విశాఖనా, అమరావతినా? అశోక్ బలహీనత చెప్పి, సంచయితపైనా సాయిరెడ్డి సంచలనం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోమారు పరిపాలనా రాజధానిగా విశాఖ వ్యవహారం తెరపైకి వచ్చింది. తాజాగా నాసా నివేదిక గ్లోబల్ వార్మింగ్ తో విశాఖ నగరం మరో 80 ఏళ్లలో కనుమరుగవుతుందని, సముద్ర నీటి మట్టం పెరగడంతో మునిగిపోతుందని వెల్లడించడంతో ఏపీ పరిపాలన రాజధాని విశాఖ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే విశాఖ నీట మునుగుతుంది అన్న వచ్చిన వార్తలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వేదికగా పచ్చ మీడియా అంటూ టార్గెట్ చేశారు.

గ్రాఫిక్స్ లో ఉండే అమరావతి మునిగే చాన్సే లేదు : సాయిరెడ్డి సెటైర్

గ్రాఫిక్స్ లో ఉండే అమరావతి మునిగే చాన్సే లేదు : సాయిరెడ్డి సెటైర్

సముద్ర మట్టానికి 45 మీటర్ల ఎత్తులో విశాఖ నగరం ఉందని, 11 మీటర్ల ఎత్తులో అమరావతి ఉందని, ముందు ఏది మునుగుతుందో చెప్పాలని లాజిక్ గా ప్రశ్నించారు. అంతేకాదు గ్రాఫిక్స్ లోనే ఉంటుంది కాబట్టి అమరావతి మునిగే చాన్సే లేదంటూ విజయ సాయి రెడ్డి సెటైర్ వేశారు. సైరా పంచ్ వేసి ధ్వజమెత్తిన విజయసాయిరెడ్డి విశాఖ పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేస్తామని, సీఎం మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుండి బల్ల గుద్ది మరీ చెబుతున్న విషయం తెలిసిందే.

రాజధాని అమరావతి ఉద్యమం వెయ్యోరోజు జరుపుకోవాలి మాలోకం

రాజధాని అమరావతి ఉద్యమం వెయ్యోరోజు జరుపుకోవాలి మాలోకం

ఇదే సమయంలో రాజధాని అమరావతిలో కొనసాగుతున్న ఉద్యమంపై కూడా రోజూ పోస్ట్ చేస్తున్న సాయిరెడ్డి రియల్ ఎస్టేట్ విలువ పడిపోయిందనే ఏడుపుతో జరుగుతున్న మందడం దీక్షను ప్రజలు ఎవరూ పట్టించుకోవడం లేదు మాలోకం నారా లోకేష్ ను టార్గెట్ చేశారు జనమంతా పాల్గొనే నిరసన అయితే జిల్లాలకు జిల్లాలే కదిలి వచ్చేవని, పెయిడ్ ఆర్టిస్ట్ లతో, మీ వాళ్లతో కలిసి నిర్వహిస్తున్న ఆందోళన కాబట్టి పరిస్థితి అలాగే ఉంటుందని విజయసాయిరెడ్డి రాజధాని అమరావతి ఉద్యమాన్ని మరోమారు ఎద్దేవా చేశారు మీరు ఇలాగే వెయ్యో రోజు జరుపుకోవాలని అంతా కోరుకుంటున్నారు అంటూ సాయి రెడ్డి ధ్వజమెత్తారు.

అశోక్ గజపతి బలహీనత వల్లే మాన్సాస్ ట్రస్ట్ బాబు చేతుల్లోకి

అశోక్ గజపతి బలహీనత వల్లే మాన్సాస్ ట్రస్ట్ బాబు చేతుల్లోకి

అశోక్ గజపతిరాజును వదలకుండా విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు సాయిరెడ్డి. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజు ను టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి కొంతమంది అశోక్ పై విమర్శలు ఏంటని గింజుకుంటున్నారు అంటూ పేర్కొని, అశోక్ గజపతిరాజు బలహీనతలను ఏకరువు పెట్టారు. ఆయన బలహీనతల్లా పదవీ వ్యామోహం అంటూ పేర్కొన్నారు. మంత్రి పదవో, ప్రభుత్వ హోదానో లేకపోతే అశోక్ బతకలేడు అంటూ వ్యాఖ్యానించిన విజయసాయిరెడ్డి పాడి ఆవు లాంటి మాన్సాస్ ట్రస్ట్ ను బాబుకు అప్పజెప్పింది అందుకేనంటూ వ్యాఖ్యానించారు. వందల కోట్ల భూములకు ఎన్ఓసి లు జారీ చేయడం భారీ స్కామ్ అని పేర్కొన్న విజయసాయిరెడ్డి 313 ఎకరాలు అడక్కుండానే ఇచ్చారట అంటూ వ్యాఖ్యానించారు.

సంచయిత రాణి ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి చెన్నమ్మల్లా వీరోచితంగా

సంచయిత రాణి ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి చెన్నమ్మల్లా వీరోచితంగా

ఇదే సమయంలో తాజాగా మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా అశోక్ గజపతి రాజునే అని మరోమారు కోర్టు తీర్పు ఇవ్వడంతో, అటు సంచయతకు, ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. అయితే ఈ విషయంపై స్పందించిన విజయసాయిరెడ్డి వీరోచితంగా పోరాడిన రాణి ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి చెన్నమ్మ లను గుర్తు చేస్తూ సంచయిత వీరోచితంగా పోరాడారని పేర్కొన్నారు. పురుష వారసులు లేని రాజ్యాలను కొట్టేయడానికి ఈస్టిండియా కంపెనీ గవర్నర్ జనరల్ హౌస్ రాజ్యసంక్రమణ సిద్ధాంతం ప్రవేశపెట్టారని, ఆయన కుట్రలకు వ్యతిరేకంగా రాణి ఝాన్సీ లక్ష్మీబాయి రాణి చెన్నమ్మలు వీరోచితంగా పోరాడి చిరస్థాయిగా నిలిచిపోయారని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు.

కప్పం కట్టే సామంతరాజు బుద్ధి పోనిచ్చుకోలేదు అశోక్ అంటూ ధ్వజం

కప్పం కట్టే సామంతరాజు బుద్ధి పోనిచ్చుకోలేదు అశోక్ అంటూ ధ్వజం

డల్హౌసీ సిద్ధాంతానికి అశోక్ పూసపాటి ఆలోచనలకు ఏమైనా తేడా ఉందా అంటూ అశోక్ గజపతిరాజు పై విరుచుకుపడ్డారు. ఇంకా ఈస్టిండియా కంపెనీ సిద్ధాంతాలను పాటిస్తూ కప్పం కట్టే సామంతరాజు బుద్ధి పోనిచ్చుకోలేదు అంటూ అశోక్ గజపతిరాజుపై విరుచుకుపడ్డారు. మహిళలను వారసులుగా అంగీకరించని ఫ్యూడల్ వ్యవస్థ కాదిది. మహిళలకు సమాన హక్కులు కల్పించిన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామంటూ సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+