బండ్ల గణేష్ పై సాయిరెడ్డి సంచలనం : చెర్రీ-తారక్ ను చీట్ చేసినా..నిన్ను : ఆకులు..వక్కలు..నీ బతుకు..!!
సాయిరెడ్డి వర్సెస్ బండ్ల గణేష్ ట్వీట్ల యుద్దం తారా స్థాయికి చేరింది. సాయిరెడ్డిని తీవ్ర పదజాలంతో బండ్ల గణేష్ ట్వీట్ల ద్వారా ప్రశ్నించారు. దీనికి ప్రతిగా బండ్ల గణేష్ తన పైన చేసిన ట్వీట్లకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత సాయిరెడ్డి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. బండ్ల గణేష్ తరహాలోనే వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. సాయిరెడ్డి కమ్మ సామాజిక వర్గాన్ని కించ పర్చేలా మాట్లాడుతున్నారంటూ......చెల్లెల్ని అన్న నుంచి దూరం చేసిన దగుల్బాజీ అని విజయసాయిరెడ్డిపై బండ్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు ఆరోపణలతో ట్వీట్లు చేసారు.
జీవితాంతం వెంటాడుతాడు..
దీనికి ప్రతిగా.. ఆకులు..వక్కలు..పక్కలు...ఇదేగా నీ బతుకు.. అంతే ఈజీ అనుకున్నావా ఎవరిని పడితే వాళ్లను కరవడం? ఎవడో ఉస్కో అనగానే పిచ్చి పట్టిన వీధి కుక్కలా ఎగిరెగిరి మొరుగుతున్నావ్. మొరిగి మొరిగి సొమ్మసిల్లినా ఓడలు బండ్లవుతాయి కానీ బండ్లు ఓడలు కావు. అయ్యో...గణేశా' అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. నీవు మర్చిపోయినట్టు నటిస్తున్నా సచిన్ జోషి మాత్రం నిన్ను జీవితాంతం వెంటాడుతుంటాడు. మూవీకి అతను ఫైనాన్స్ చేస్తే రైట్స్ నువ్వు అమ్ముకున్నావంట...అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
రాంచరణ్ - ఎన్టీఆర్ ను ఛీట్ చేసినా
చెప్పు తెగేలా కొట్టింది, ఫోన్ పగిలింది నిజమేనా బండ్లా? రామ్ చరణ్, ఎన్టీఆర్, పూరీలను ఛీట్ చేసినా వదిలేశారు. అందరూ వాళ్లంత మంచోళ్లు కారు...అంటూ మరో ట్వీట్ లో వ్యాఖ్యానించారు. వరుసగా ట్వట్లతో బండ్ల గణేష్ పైన సాయిరెడ్డి మాటల దాడి కొనసాగించారు. వెన్నుపోటు పేటెంటు నీ యజమాని చంద్రబాబుది. 28 ఏళ్లుగా చెక్కు చెదరని గిన్నెస్ రికార్డు. ఇంకో వందేళ్లయినా అది బాబు పేరనే ఉంటుంది. ఇంత చిన్న లాజిక్ మర్చిపోతే ఎట్లా బండ్లా? ప్రతి కుక్కా సింహం కావాలనుకుటుందంటూ ట్వీట్ చేసారు.

జాతకం లైట్ బోయ్ నుంచి అందరికీ..
నీలాంటి వాడే భౌ..భౌమని మొరిగి గర్జించా అనుకుని మురిసిపోతుంటాడు...అంటూ మరో ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక, బ్రోకర్లు, తార్పుడుగాళ్లు, మోసగాళ్లు, జేబులు కొట్టేవాళ్ళు ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళని విమర్శిస్తే పెద్దోళ్లు అయిపోతామని భ్రమపడుతుంటారు. బండ్లలాగా. ఎన్నిసార్లు తన్నులు తిన్నది, ఎవరెవరి కాళ్లుపట్టుకున్నదీ జాతకం లైట్ బోయ్ నుంచి అందరికీ తెలుసు. కుక్కకాటుకు చెప్పుదెబ్బలు తప్పవని సాయిరెడ్డి ట్వీట్లలో బండ్ల గణేష్ ను టార్గెట్ చేసారు.