విజిలెన్సు దర్యాప్తులో 'అశోక' గుట్టు బయటకు, వందల కోట్లు నాకేసేవాడు చంద్రబాబు : సాయిరెడ్డి సంచలనాలు
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై,టిడిపి నేతలపై ధ్వజమెత్తారు. ముఖ్యంగా అశోక్ గజపతిరాజు ను గత కొంతకాలంగా టార్గెట్ చేస్తున్న విజయసాయిరెడ్డి మరోమారు మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో విజిలెన్సు దర్యాప్తుపై ఆసక్తికర పోస్ట్ చేశారు. అంతేకాదు రాజధాని అమరావతి ఉద్యమం రోజుల లెక్కకు తప్ప దేనికోసం అంటూ నిప్పులు చెరిగారు. ఇదే సమయంలో ఎంపీ రఘురామ కృష్ణం రాజును , ఈఎస్ఐ స్కామ్ లో ఇరుక్కున్న అచ్చెన్నాయుడును టార్గెట్ చేశారు . ఇక యధావిధిగా చంద్రబాబు పై విరుచుకు పడే విజయసాయిరెడ్డి ఆసక్తికర పోస్ట్ తో చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు.

ఏ సంక్షోభం అయినా వాడుకోవటం లో చంద్రబాబు దిట్ట
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుని టార్గెట్ చేస్తూ చేసిన పోస్టులో చంద్రబాబు నాయుడు ప్రతి సంక్షోభాన్ని తన స్వార్థం కోసం వాడుకున్నాడని పేర్కొన్నారు. తన స్వార్ధానికి ప్రతి సంక్షోభాన్ని వాడుకోవడం చంద్రబాబుకు జన్మతః ఒంటబట్టిన విద్య అంటూ విమర్శించారు. ప్రజల జీవితాలను ప్రభావితం చేసే తుఫానులు కావచ్చు.. కరువు, కరోనా ఏదైనా సరే చంద్రబాబు తనకు అనుకూలంగా వాడేస్తాడని విమర్శించారు. ఇక రెండు రోజుల్లో బిగించిన పులిచింతల గేట్ అయినా వదలడని, అది కూడా చంద్రబాబుకు ఆయుధమని పేర్కొన్న విజయసాయిరెడ్డి బెజవాడ కొట్టుకుపోతుందన్న హారర్ సీన్ క్రియేట్ చేసి వందల కోట్లు నాకేసేవాడు అంటూ చంద్రబాబును టార్గెట్ చేశారు.

తప్పు చెయ్యక పోతే భయమేలా అశోకా అంటూ ప్రశ్న
అంతేకాదు అశోక్ గజపతిరాజును టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి మాన్సాస్ , సింహాచలం దేవస్థానం భూ అక్రమాలు నిజమేనని ప్రాథమిక విచారణలో తేలిపోయిందని పోస్ట్ చేశారు .విజిలెన్సు దర్యాప్తులో 'అశోక' గుట్టు బయటకు వస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడిట్ వద్దంటూ కోర్టుకెళ్లిన అతనికి మొట్టికాయలు పడ్డాయని పేర్కొన్న విజయసాయిరెడ్డి, తప్పు చెయ్యక పోతే భయమేలా అశోకా .. అంటూ ప్రశ్నించారు. తన అక్రమాలపై విచారణ వద్దంటాడా ? ధైర్యంగా ఎదుర్కొంటాడా ? అంటూ అశోక్ గజపతిరాజును నిత్యం తన వ్యాఖ్యలతో ఇరకాటంలోకి నెడుతున్నారు.

రాజధాని అమరావతి ఉద్యమంపై షాకింగ్ కామెంట్
ఇదే సమయంలో రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని చేస్తున్న అమరావతి ఉద్యమంపై వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి షాకింగ్ పోస్ట్ చేశారు. ఇటీవల మరోమారు రాజధాని అమరావతి ఉద్యమం మళ్ళీ తెరమీదకు వచ్చిన నేపధ్యంలో అమరావతికి ఆ ఎత్తున మద్దతు ఉంటే 'ఏసీ' ధర్నా శిబిరం లో కూర్చున్న వారి బంధు మిత్రులు ఉన్న గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లలో వన్ సైడ్ గా గెలిచి ఉండేవారని ఆసక్తికర ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. రాజధాని అమరావతి ఉద్యమానికి అక్కడి ప్రజల మద్దతు లేదని రియల్ ఎస్టేట్ గోల తప్ప రాజధానికి ఏం సంబంధమని అక్కడి పౌరులు చెంప పగలగొట్టే తీర్పు చెప్పారని గుర్తు చేశారు. గత ఎన్నికలలో గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లు వైసీపీ ఖాతాలో పడ్డాయని స్పష్టం చేసిన విజయసాయిరెడ్డి . రోజుల లెక్కకు తప్ప రాజధాని అమరావతి కోసం ధర్నా దేనికి అంటూ ప్రశ్నించారు.

రఘురామపై విజయసాయి అస్త్రం .. వదల బొమ్మాలీ అంటూ
అంతేకాదు ఎంపీ రఘురామ కృష్ణం రాజు, ఓ ఛానల్ చైర్మన్ కు మధ్య జరిగిన మిలియన్ యూరోల హవాలా లావాదేవీల గురించి ఆధారాలతో సహా రాసిన లేఖకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారని, ఈ అంశంపై విచారణ జరిగేలా చూస్తామని బదులు ఇచ్చారని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. ఎంపీ రఘురామకృష్ణంరాజును సైతం వదల బొమ్మాలి అంటూ విజయసాయిరెడ్డి టార్గెట్ చేస్తూనే ఉన్నారు .అంతేకాదు ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడినట్టుగా ఉంది పచ్చ పార్టీ పరిస్థితి అంటూ తెలుగుదేశం పార్టీ ని టార్గెట్ చేశారు.

ప్రజలు తన్ని తరిమేసినా రోజుకో రభస అంటూ ధ్వజం
రాష్ట్రాన్ని అన్ని రకాలుగా బ్రష్టు పట్టించింది కాక ఎల్లో మీడియా, బాబు బానిస పార్టీలు, యూరో లలో ఫీజులు తీసుకునే కోవర్టులు రెచ్చిపోతున్నారు అంటూ నిప్పులు చెరిగారు విజయసాయిరెడ్డి .వరుస ఎన్నికలలో ప్రజలు తన్ని తరిమేసిన రోజుకో రభస సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓటమి పాలయ్యింది. ఇక ఇదే విషయాన్ని పదేపదే విజయసాయి రెడ్డి గుర్తు చేస్తూ టీడీపీ నేతలతో మైండ్ గేమ్ ఆడుతున్నారు.

అచ్చెన్నను టార్గెట్ చేసిన సాయి రెడ్డి,.. ఈఎస్ఐ స్కాం గుర్తు చేసి మరీ
ఇక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి జగన్ ప్రభుత్వం పై అవినీతి ఆరోపణలు చేస్తున్న అచ్చెన్నాయుడుకి రివర్స్ కౌంటర్ ఇచ్చారు. అచ్చెన్నకు ఈఎస్ఐ కుంభకోణాన్ని గుర్తుకు తెచ్చారు. ఈఎస్ఐ స్కామ్ లో పీకలదాకా ఇరుక్కున్న వాడివి ... నువ్వు అవినీతి ఆరోపణలు చేస్తే ఎలా అచ్చెన్నా .. నీ పుణ్యమా అని మొన్ననే ముగ్గురు అధికారులు జైలుపాలయ్యారు. ఇంకా ఎన్ని శోకాలు వినిపిస్తాయో అంటూ వ్యాఖ్యానించారు. కార్మికుల ఉసురు పోసుకున్నోడివి.. అందరి తర్వాత అయినా మళ్లీ నీ వంతు తప్పదు అంటూ మళ్ళీ ఈఎస్ఐ స్కాంలో నీకు తిప్పలు తప్పవు అంటూ విజయసాయిరెడ్డి అచ్చెన్నాయుడును విమర్శించారు.

వరుసగా టీడీపీ నేతలపై సంచలన పోస్టులతో సాయిరెడ్డి
నిత్యం టిడిపి నేతలను టార్గెట్ చేయడమే కాకుండా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు సోషల్ మీడియా ద్వారానే బదులు చెప్పే విజయసాయిరెడ్డి ఏకకాలంలో టీడీపీ కీలక నేతలను తన పోస్టుల ద్వారా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ రోజు ఏకంగా అచ్చెన్నపై, అశోక్ గజపతి రాజుపై, చంద్రబాబుపై , రఘురామ కృష్ణం రాజుపై విరుచుకుపడటమే కాకుండా రాజధాని అమరావతి ఉద్యమంపై షాక్ అయ్యేలా వ్యాఖ్యలు చేశారు.
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications