విజయసాయి నా కళ్లు కడుగుతారా, అందుకే రాజ్యసభకు: అనిత

Posted By:
Subscribe to Oneindia Telugu

విశాఖ: భూదందాల వ్యవహారంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత బుధవారం నాడు తీవ్రంగా ఖండించారు.

14 కేసుల్లో ఏ-2 నిందితుడిగా ఉన్న వ్యక్తి విశాఖ భూములపై మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. అరెస్టుల నుంచి తప్పించుకోవడానికే విజయ సాయి రెడ్డి రాజ్యసభ సీటు తెచ్చుకున్నారని ఆరోపించారు.

నంద్యాలలో చంద్రబాబు చేసిన సర్వేనే దెబ్బకొట్టింది!

భూదందాలపై ఆయన బహిరంగ చర్చలకు రావాలని అనిత సవాల్ విసిరారు. తనపై విజయ సాయి రెడ్డి ఆరోపణలు చేశారని, వాటిని నిరూపిస్తే ఆయన కాళ్లు కడిగి నెత్తి మీద చల్లుకుంటానని చెప్పారు.

Vijaya Sai Reddy should touch my feet if he failed to prove allegations on me: Anitha

తనపై విజయసాయి ఆరోపణలు నిరూపించలేకపోతే ఆయన అలా చేస్తారా అని ప్రశ్నించారు. ఆరోపణలు చేసిన తర్వాత దానికి తాము సవాల్ చేస్తే ముందుకు వచ్చి మాట్లాడే సత్తా, దమ్ములేని నాయకులు వైసిపి నేతలు అని ఎద్దేవా చేశారు. తాను ఎలాంటి భూదందాలకు పాల్పడలేదన్నారు.

వైసిపి నేతలపై తాను ఇంతవరకు ఒక్క అట్రాసిటీ కేసు కూడా పెట్టలేదని అనిత చెప్పారు. తన గురించి అసభ్య పోస్టులు పెట్టినవారిపై మాత్రమే కేసులు పెట్టానని స్పష్టం చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TDP MLA Vangalapudi Anitha on Tuesday challenged YSR Congress Party Rajya Sabha Member Vijaya Sai Reddy should touch my feet if he failed to prove allegations on me.
Please Wait while comments are loading...