ఇంతకాలం గుడ్డి గుర్రం పళ్లు తోమావా .. గాడిదలు కాస్తున్నావా రాజా? అశోక్ గజపతిపై సాయిరెడ్డి ధ్వజం

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాన్సాస్ ట్రస్ట్ కార్యకలాపాలపై ఆడిటింగ్ జరుగుతున్న నేపథ్యంలో మరోమారు టిడిపి సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ను టార్గెట్ చేశారు. తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు. నిన్నటి నుండి ట్రస్ట్ కార్యాలయంలో రికార్డులను విజయనగరం జిల్లా ఆడిటింగ్ అధికారుల పరిశీలిస్తున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి తాజాగా ఈ ఆడిటింగ్ పై స్పందించారు.

మాన్సాస్ ట్రస్ట్ లో కొనసాగుతున్న ఆడిటింగ్ .. అశోక్ గజపతిని టార్గెట్ చేసిన సాయిరెడ్డి

మాన్సాస్ ట్రస్ట్ లో కొనసాగుతున్న ఆడిటింగ్ .. అశోక్ గజపతిని టార్గెట్ చేసిన సాయిరెడ్డి

మాన్సాస్ ట్రస్ట్ కార్యకలాపాలపై జిల్లా ఆడిట్ అధికారిణి హిమబిందు నేతృత్వంలో ఆడిటింగ్ చేపట్టిన అధికారులు 2004 నుండి ట్రస్ట్ కార్యకలాపాలపై ఆడిటింగ్ చేయాల్సి ఉందని వెల్లడించారు. దానికోసం అన్ని రికార్డులను తమకు ఇస్తే పూర్తిస్థాయిలో ఆడిటింగ్ చేయడానికి వీలవుతుందని, కానీ ట్రస్టు కొన్ని హార్ట్ కాపీలను మాత్రమే అందించిందని వెల్లడించారు. మొత్తం రికార్డులను ఆడిటింగ్ చేయడం కోసం ట్రస్ట్ నిర్వాహకులతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఇన్ని సంవత్సరాల నుంచి ఆడిటింగ్ చేయకుండా ఏం చేశావ్ అశోక్ గజపతి అంటూ ఆయనను టార్గెట్ చేశారు.

 అప్పుడేం చేశావ్ .. రాజ్యం చంద్రబాబు భోజ్యం లా చేశావు

అప్పుడేం చేశావ్ .. రాజ్యం చంద్రబాబు భోజ్యం లా చేశావు


అధికారం పోయాక అశోకగజపతి అసలు గుట్టు బయట పడుతోంది అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన విజయసాయిరెడ్డి 2004 నుండి మాన్సాస్ లో అసలు ఆడిటింగే జరగలేదు. ఆడిటింగ్ కి డబ్బులు ఇచ్చేశాం . అధికారులు వివరాలు ఇవ్వాలని లేఖలు రాస్తే ఇప్పుడు ఏం లాభం అంటూ ప్రశ్నించారు. ఇంతకాలం గుడ్డి గుర్రాల పళ్ళు తోమావా ? గాడిదలు కాస్తున్నావా రాజా? రాజ్యం చంద్రబాబు భోజ్యం లా చేశావు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టు .. చంద్రబాబు తీరు

తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టు .. చంద్రబాబు తీరు

ఇదే సమయంలో చంద్రబాబును సైతం టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి తల్లి పాలు తాగి రొమ్మును గుద్దినట్లు చంద్రబాబు కారణంగా సొంత జిల్లా కూడా కన్నీరు పెడుతోంది అంటూ ఘాటుగా విమర్శించారు. పిల్లలు పదవిని ఇచ్చిన మామకు వెన్నుపోటు పొడవటం చంద్రబాబు నైజం. ఇదే క్రమంలో చిత్తూరు జిల్లాలో 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే 3 రిజర్వాయర్లను అడ్డుకోవడం కోసం ఎన్జీటీలో పిటిషన్ లు వేయించాడు చంద్రబాబు అంటూ ఆరోపణలు గుప్పించారు. అందుకే నీకు ఎందుకు జన్మనిచ్చానా అని నీ సొంత జిల్లా కూడా కన్నీరు పెడుతోంది బాబూ అంటూ విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

జలవివాదాల విషయంలో కూడా టార్గెట్ చంద్రబాబు

జలవివాదాల విషయంలో కూడా టార్గెట్ చంద్రబాబు

ప్రస్తుతం ఏపీలో జల వివాదాలపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వాడివేడి మాటల యుద్ధం కొనసాగుతున్న సమయంలో తాజా పరిస్థితులకు చంద్రబాబు కారణమంటూ వైసీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే క్రమంలో విజయసాయిరెడ్డి కూడా చిత్తూరు జిల్లాలకు సాగునీరు అందక పోవడానికి, రాయలసీమ కరువు బారిన పడడానికి చంద్రబాబే కారణం అంటూ పదే పదే ధ్వజమెత్తుతున్నారు. ఇక మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలోనూ అశోక్ గజపతిరాజును వదల బొమ్మాలి వదలా అంటున్నారు.

 గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్లు వేయించిన రైతు ద్రోహి చంద్రబాబు

గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్లు వేయించిన రైతు ద్రోహి చంద్రబాబు

ఇదే సమయంలో అప్పట్లో మహానేత వైఎస్సార్ చేపట్టిన జలయజ్ఞం ను ప్రసాద్ నాయుడు చేత కేసులు వేయించి రెండేళ్లు అడ్డుకున్నారు చంద్రబాబు అంటూ నిప్పులు చెరిగిన విజయసాయిరెడ్డి, ఇప్పుడేమో సీమ ఎత్తిపోతల పథకం తో పాటు జగన్ గారు మొదలుపెట్టిన చిత్తూరు ప్రాజెక్టులపై స్టే కోరుతూ తన వాళ్లతో గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ వేయించాడు రైతు ద్రోహి అంటూ చంద్రబాబును టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు . ప్రస్తుతం రాయలసీమకు, చిత్తూరుకు అన్యాయం జరగడానికి చంద్రబాబే కారణమంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+