అమ్మకు ప్రేమతో: విజయమ్మకు కేక్ తినిపించిన జగన్(పొటోలు)
హైదరాబాద్: తన తల్లి వైయస్ విజయమ్మ 60వ పుట్టినరోజు సందర్భంగా , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైయ జగన్మోహన్ రెడ్డి మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. విజయమ్మ జన్మదిన వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు.

తన తల్లికి కేక్ తినిపించి వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆమె మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
Celebrating Mom's 60th birthday. pic.twitter.com/zyUUt8Sc6I
— YS Jagan Mohan Reddy (@ysjagan) 19 April 2016
ఈ సందర్భంగా వైయస్ జగన్‌ను అప్యాయంగా ముద్దాడిన విజయమ్మ ఆశీస్సులు అందజేశారు. 'మా అమ్మ 60వ పుట్టినరోజు ఇలా జరుపుకున్నాం' అంటూ తన తల్లితో కలిసి దిగిన ఫొటోలను వైయస్ జగన్ తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. కుటుంబసభ్యులతోపాటు అభిమానులు, కార్యకర్తలు విజయమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.












Click it and Unblock the Notifications