చంద్రం .. మీ కుట్ర విఫలం .. వైఎస్సార్ ఆసరా సఫలం : విజయసాయి ఫైర్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై, నారా లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు. ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మహిళల డ్వాక్రా రుణాలను చెల్లించడం కోసం ఆసరా పథకాన్ని అందిస్తే, దానిపై కూడా కుట్రలు చేయడానికి చంద్రబాబు వెనకాడటం లేదని విమర్శించిన విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.చంద్రం.. మళ్లీ దళిత రాజకీయం మొదలు పెట్టావా అంటూ విజయసాయి రెడ్డి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.

నిన్నటికి నిన్న రుణాలు మాఫీ చేస్తామని సున్నా వడ్డీ ఇస్తామని మోసం చేసిన చంద్రబాబెక్కడ? హామీని నిలబెట్టుకున్న తొలివిడత లోనే 6792 కోట్ల రూపాయలు వైయస్సార్ ఆసరా పథకంలో భాగంగా అక్కచెల్లెళ్ళు ఖాతాలో జమ చేసిన జగన్ గారు ఎక్కడ అంటూ చంద్రబాబుని టార్గెట్ చేసిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఇప్పుడు మరోమారు ఆసరా పథకం విషయంలో చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Vijayasai Fire on chandrababu Your conspiracy failed ,YSR asara succeed

సీఎం జగన్ శ్రీకారం చుట్టిన వైయస్సార్ ఆసరా నుండి ప్రజల దృష్టి మరల్చడం కోసమే మీ కుతంత్రం కదా అంటూ ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. కానీ మీ కుట్ర విఫలమైంది వైయస్సార్ ఆసరా సఫలమైంది అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. మళ్లీ వినండి ..మాట నిలబెట్టుకుని తొలివిడతలో 6792 కోట్ల రూపాయలు అక్కాచెల్లెళ్ల ఖాతాలో సీఎం జగన్ మోహన్ రెడ్డి జమ చేశారు అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

మరోపక్క వైయస్సార్ ఆసరా పథకం తో సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళలు మోసం చేస్తున్నారని, టిడిపి పథకాలు పేరుమార్చి తమ పథకాలు గా ప్రచారం చేసుకుంటున్నారని టిడిపి నేతలు మండి పడుతున్న విషయం తెలిసిందే. టిడిపి హయాంలో డ్వాక్రా రుణమాఫీ, పసుపు కుంకుమ పేరుతో మహిళలకు ఆర్థిక భరోసా ఇచ్చి, మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిందని చెప్తున్న టిడిపి నాయకులు వైయస్సార్ ఆసరా పథకం పచ్చి మోసం గా అభివర్ణిస్తున్నారు. ఆసరా పేరుతో మహిళలకు టోకరా వేశారని మండిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+