
పులులకు పందులతో పోటీనా? భోగాపురం రిసార్ట్ లో భోగంమేళాలతో పావుగుండుపాత్రుడు: సాయిరెడ్డి తిట్లదండకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం పీక్స్ కు చేరుకుంది. నిత్యం టిడిపి అధినేత చంద్రబాబును, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను సోషల్ మీడియా వేదికగా తిట్టిపోసే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, తాజాగా అయ్యన్నపాత్రుడుని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. నోటికొచ్చిన బూతులన్నీతిడుతున్నారు. అయ్యన్నపాత్రుడు ఇంటి గోడ కూల్చివేతతో ప్రారంభమైన మాటల యుద్ధం నేటికీ కొనసాగుతుంది.

సవాళ్ళు ప్రతిసవాళ్ళను మించి .. తిట్ల దండకం అందుకున్న అయ్యన్నపాత్రుడు, సాయిరెడ్డి
విజయసాయిరెడ్డిని నర్సీపట్నం వస్తే తేల్చుకుందామని సవాల్ విసిరిన అయ్యన్న కు, టైము డేటు చెప్పాలంటూ ఎంపీ విజయసాయిరెడ్డి అయ్యన్నపాత్రుడు చేసిన సవాలును స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఇక అయ్యన్నపాత్రుడుని పిల్లి అంటూ, కానీ పులి లాగా ఫీల్ అవుతారని విమర్శలు చేశారు. అయితే దానికి అయ్యన్నపాత్రుడు ఎప్పుడు వచ్చినా తాను సిద్ధంగా ఉంటాను అంటూ పేర్కొని, 16 నెలలు జైల్లో ఉండి చిప్పకూడు తిన్న సాయిరెడ్డి అక్కడ తోటి ఖైదీలు, జైలు అధికారులు కొట్టన దెబ్బల చారలు చూసి పులిగా ఫీల్ అవుతున్నారని ఎద్దేవా చేశారు. పులి అయితే పోలీసులు లేకుండా సింగిల్ గా రావాలని విజయసాయిరెడ్డికి సవాల్ విసిరారు.

బూతుపాత్రుడు అయ్యన్న అంటూ సాయిరెడ్డి తిట్లు
దీంతో విజయసాయిరెడ్డి తీవ్రపదజాలంతో అయ్యన్నపాత్రుడు పై విరుచుకుపడ్డారు నిన్నటికి నిన్న అచ్చం, బుచ్చం, బుద్ధిలేని వెంకు, బూతు పాత్రుడు, బ్రోతల్ హౌస్ ఓనర్ నుంచి పప్పు, బొల్లి బాబులదాకా - ప్రతోడు అధికారంలోకి వస్తే వాణ్ణి వేసేస్తాం, వీణ్ణి పొడిచేస్తాం అని ప్రగల్బాలు పలికే వారే అని మండిపడ్డారు. ఇంకో తరం వరకు మీరు అధికారంలోకి వచ్చేదీ లేదు, పీకేదీ లేదు అంటూ దుర్భాషలాడిన విజయసాయిరెడ్డి తాజాగా మరోమారు అయ్యన్నపాత్రుడు ని టార్గెట్ చేశారు.

పులులు ఎప్పుడూ పందులతో పోటీ పడవు అన్న సాయిరెడ్డి
పులులెప్పుడూ పందులతో పోటీ పడవు అంటూ అయ్యన్నపాత్రుడు ని పంది తో పోల్చారు విజయసాయిరెడ్డి. పులి లాగ ఉండేవారు అర్ధరాత్రి కోర్ట్ స్టేలు తెచ్చుకోరని, బీసీలపై కక్ష సాధింపంటూ ఆక్రందనలు చేయరని టార్గెట్ చేశారు. మాటిమాటికి గంజాయి పాత్రుడూ అంటూ అయ్యన్నపాత్రుడు ని టార్గెట్ చేస్తున్న విజయసాయిరెడ్డి దాన కర్ణుడినంటావ్. 2 సెంట్లు కూడా వదలక కబ్జా చేశావ్ అంటూ మండిపడ్డారు. 'నీ బతుకే గంజాయి. అది పీల్చి పీల్చి పిచ్చెక్కి వాగుతూ పోలీసులు వస్తే నక్కలా నక్కుతున్నావ్ అంటూ అయ్యన్నపాత్రుడు ని తిట్టిపోశారు.

భోగాపురం రిసార్ట్ లో భోగం మేళాలు..అశ్లీల నృత్యాలు చేసే పావుగుండు పాత్రుడు
అంతేకాదు భోగాపురం రిసార్ట్ లో భోగం మేళాలు పెట్టుకునిఅశ్లీల నృత్యాలు చేసే పావుగుండు పాత్రుడికి సిగ్గూ ఎగ్గూ లేదు - పెగ్గుంటే చాలు అంటూ తీవ్ర పదజాలంతో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నోటికొచ్చినట్టు తిట్టారు. గంజాయి తాగి వాగడం - మహిళలతో తిట్టించుకోవడం ఈ నర్సీపట్నం నక్కకు అలవాటే అంటూ ఎద్దేవా చేశారు. డోస్ పెంచి మరీ విజయసాయిరెడ్డి తిట్టిన తిట్లకు అయ్యన్నపాత్రుడి ప్రతిస్పందన ఏవిధంగా ఉండబోతుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.