వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వార్ వైసిపి సైడే..టీడీపీ సూసైడ్; వాళ్ళ తొడకొట్టడాలు, ఆర్తనాదాలు అందుకే: విజయసాయిరెడ్డి సెటైర్లు

|
Google Oneindia TeluguNews

టీడీపీ అధినేత చంద్రబాబుపై, లోకేష్ పై, టిడిపి నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ట్విట్టర్ వేదికగా నిత్యం విమర్శలు గుప్పిస్తున్న విజయసాయిరెడ్డి డోస్ పెంచి మరీ తెలుగుదేశం పార్టీ నాయకులను తిడుతున్నారు. తాజాగా చంద్రబాబుపై, లోకేష్ పై మండిపడ్డ విజయసాయిరెడ్డి, అయ్యన్నపాత్రుడు అడ్డగాడిద అంటూ, అశుద్ధ పాత్రుడు అంటూ నానా తిట్లు తిట్టారు. ఇక తెలుగుదేశం పార్టీలో మహిళా నేతలకు గౌరవం లేదంటూ దివ్యవాణి రాజీనామాపై విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.

చంద్రబాబు జీవితమంతా నక్క జిత్తులు, చీకటి పొత్తులే

చంద్రబాబు జీవితమంతా నక్క జిత్తులు, చీకటి పొత్తులే

చంద్రబాబు చేస్తుంది పేరుకే పోరాటమని, చీకటి పొత్తులు, నక్క జిత్తులే చంద్రబాబు జీవితమంతా అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. స్థానిక, మున్సిపల్ ఎన్నికల్లో అన్ని చోట్లా చిత్తు చిత్తుగా ఓడాక యుద్ధనీతి పక్కకు తప్పుకుంది అని పేర్కొన్నారు. గెలుపు అసాధ్యమని తెలిసొచ్చింది చంద్రబాబుకు అంటూ ఎద్దేవా చేశారు. ఇప్పుడు 'కడుపుమంట' తీర్చుకోవడమే చంద్రబాబుకు ముఖ్యం అని పేర్కొన్నారు. తొడకొట్టడాలు, సొల్లు వాగుళ్లు, ఆర్తనాదాలు అందుకే అంటూ సెటైర్లు వేశారు. ఇక చంద్రబాబు వార్ వన్ సైడే తమ్ముళ్ళు అని చెప్పిన వ్యాఖ్యలను ఉద్దేశించి అవును వార్ వైసిపి సైడే అంటూ టీడీపీకి సూసైడ్ అంటూ సెటైర్లు వేశారు విజయసాయిరెడ్డి.

 అయ్యన్నపాత్రుడుపై ఘాటుగా సాయిరెడ్డి వ్యాఖ్యలు

అయ్యన్నపాత్రుడుపై ఘాటుగా సాయిరెడ్డి వ్యాఖ్యలు


ఇక అయ్యన్నపాత్రుడును టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి పచ్చి బూతుకి దున్నపోతుకి పుట్టిన ఈ అడ్డగాడిద నోట్లో నుంచి మల మూత్రాల డ్రైనేజీ.. మాటల రూపంలో ఎలా పొంగిపొర్లి జాలువారుతుందో చూడండి అంటూ ఎద్దేవా చేశారు. వీడిని ఏమని పిలవాలి? గంజాయి పాత్రుడు అనా? లేక అశుద్ధం పాత్రుడు అనా? అంటూ మండిపడ్డారు. టీడీపీలో మహిళలకే కాదు. ఎవరికీ గౌరవం లేదు. వెన్నుపోటు కుట్రలో కత్తి అందించిన వారు, నెత్తుటి మరకలు తుడిచిన వారంతా 'బారాహ్ ఖూన్ మాఫ్' అన్నట్టు పునీతులయ్యారు అంటూ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

ప్యాకేజి కోసం పనిచేసే పాలేర్లు తప్ప పచ్చపార్టీలోవారు ఇంకా అంటరానివారే

ప్యాకేజి కోసం పనిచేసే పాలేర్లు తప్ప పచ్చపార్టీలోవారు ఇంకా అంటరానివారే

బాబు నీడలో దోచుకుని బాగుపడింది వాళ్లేనని విమర్శించారు. ప్యాకేజి కోసం పనిచేసే పాలేర్లు తప్ప పచ్చ పార్టీలో బడుగువర్గాల వారు ఇంకా అంటరానివారే అని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు, లోకేశ్ లకు మహిళలంటే ఎంత చిన్నచూపో అనేక సందర్బాల్లో బయటపడిందని పేర్కొన్నారు. స్త్రీలంటే బానిసలు, నాయకత్వానికి పనికిరారు అనే భావన వీళ్లది అంటూ విజయ సాయి రెడ్డి విమర్శించారు. ఆరోజుల్లోనే జయప్రదంగా నలుపును తెలుపు చేసుకున్నారు. ఆ ప్రయోగాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వలంటీర్లు తలుపులు కొడుతున్నారని నిందించింది అందుకే అని విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

బోకేష్‌ వాళ్ల నాన్న ఏం చెబుతున్నాడంటే.. సాయిరెడ్డి ఎద్దేవా

బోకేష్‌ వాళ్ల నాన్న ఏం చెబుతున్నాడంటే.. సాయిరెడ్డి ఎద్దేవా

అంతేకాదు చంద్రబాబును ఉద్దేశించి బోకేష్‌ వాళ్ల నాన్న ఏం చెబుతున్నాడంటే అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి అవినీతి కేసుల్లో కానిస్టేబుల్‌తో దర్యాప్తు చేయించినా తనకు యావజ్జీవ జైలు ఖాయమని వెల్లడించారు. ఇప్పుడు తూర్పు తిరిగి దండం పెట్టడం (టీడీపీ) మాత్రమే తాను, తన కొడుకు చేయగలిగిన పని అని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిపారు. ఎల్లో మీడియా, వ్యవస్థల మేనేజ్‌మెంటే తనకు దిక్కు అని చంద్రబాబు బాధపడిపోతూ ఉన్నాడని విజయ సాయి రెడ్డి ఎద్దేవా చేశారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో తనను పట్టించుకునే వారే లేరట.. చంద్రబాబు బాధ

రాష్ట్రపతి ఎన్నికల్లో తనను పట్టించుకునే వారే లేరట.. చంద్రబాబు బాధ

రాష్ట్రపతి ఎన్నికల్లో తనను పట్టించుకునే వారే లేరని చంద్రబాబు తెగ బాధ పడుతున్నాడట విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక చంద్రబాబు సొంత పుత్రుడు పరమ శుంఠ అని, దత్తపుత్రుడు మీద తనకు ప్రేమని చంద్రబాబు చెబుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టి ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకున్నాడని చంద్రబాబును టార్గెట్ చేశారు. పోలవరం ను ఏటీఎం గా మార్చుకున్న పేటీఎం బ్యాచ్ తమదేనని చంద్రబాబు చెప్పుకుంటున్నారు అంటూ సెటైర్లు వేశారు.

English summary
YSRCP MP Vijayasai reddy has been lashing out at TDP chief Chandrababu, Lokesh, TDP leader and former minister Ayyannapatrudu. Sai reddy told that it was known that Chandrababu victory was impossible.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X