వాటిపై పేటెంట్ హక్కుల కోసం ట్రై చెయ్యొచ్చుగా బాబుగారు: సాయిరెడ్డి సెటైర్లు!!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని ఏపీ సిఐడీ పోలీసులు స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో భాగంగా అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ నేతలు ఆందోళనలకు దిగుతుంటే వైసీపీ నేతలు చంద్రబాబును, చంద్రబాబు అవినీతిని టార్గెట్ చేస్తున్నారు.
చంద్రబాబు స్కిల్డ్ క్రిమినల్ అని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు చేసిన అవినీతికి ఆయనకు తప్పనిసరిగా శిక్ష పడుతుందని అంటున్నారు. ఇక టీడీపీ నేతల తీరుపై మండిపడుతున్నారు. ఇక వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబును టార్గెట్ చేసి నిత్యం విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.

తాజాగా రాజ్యసభ వేదికగా చంద్రబాబుపై సెటైర్లు వేసిన విజయసాయి రెడ్డి చంద్రబాబు అన్నీ నేనే కనిపెట్టాను అన్నట్టు చెప్పుకుంటున్నారు అన్నారు. చంద్రబాబు కనిపెట్టిన వాటికి పేటెంట్ కోసం ప్రయత్నం చేస్తే భారత్ కు బాగా ఆదాయం వస్తుందని సెటైర్లు వేశారు. చంద్రబాబు ఆ పని చేస్తే మంచిదని సలహా ఇచ్చారు.
సోషల్ మీడియా వేదికగా చంద్రబాబును టార్గెట్ చేసిన విజయసాయి రెడ్డి సెల్ ఫోను, కంప్యూటర్, మాజికల్ రింగే కాదు...విద్యుత్తు బల్బు, విమానం, నౌకలాంటి మరికొన్నింటిని కూడా చంద్రబాబు గారే కనిపెట్టి...అల్జిమర్స్ వ్యాధి ముదరడంతో వాటిని కనిపెట్టిన విషయమే మర్చిపోయారని అంటోంది పచ్చకుల మీడియా అంటూ వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి టార్గెట్ చేశారు.
వాటిపైనా పేటెంట్ హక్కుల కోసం ట్రై చేయవచ్చు కదా బాబు గారూ! అంటూ మండిపడ్డారు విజయసాయి రెడ్డి. అంతకు ముందు అవినీతి కేసులో అడ్డంగా దొరికిపోయి జైలుకెళ్లిన బాబుపై సానుభూతి కోసం ప్రయత్నిస్తోంది పచ్చకుల మీడియా అంటూ టార్గెట్ చేశారు . నక్సల్స్ క్లెమోర్ మైన్ పేలిస్తేనే రాని సానుభూతి తప్పుచేసి జైలుకెళ్తే వస్తుందా? 2024 కోసం ఏదో దింపుడు కల్లం ఆశ అంటూ విజయ సాయిరెడ్డి మండిపడ్డారు












Click it and Unblock the Notifications