
పప్పేష్.. పాదయాత్ర కోసం డాన్స్ షూటింగులు ఏంటి? దేవాతో ఆడుకో చంద్రం అన్నయ్యా: సాయిరెడ్డి
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను నిత్యం టార్గెట్ చేస్తూనే ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా వారి పరువును నిలువునా తీస్తున్నారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలపై, తెలుగుదేశం పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలపై తనదైన శైలిలో కౌంటర్ వేసిన విజయసాయిరెడ్డి చంద్రబాబు, నారా లోకేష్ పర్యటనలనూ టార్గెట్ చేస్తూ సెటైర్లు వేస్తున్నారు.

లోకేష్ పాదయాత్ర పాటలను టార్గెట్ చేసిన సాయిరెడ్డి
జనవరి 27వ తేదీ నుంచి పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించిన నారా లోకేష్ నాలుగు వందల రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్లు రాష్ట్రమంతా పర్యటిస్తానని పేర్కొన్న విషయం తెలిసిందే. మొత్తం 400 రోజులపాటు నాలుగు వేల కిలోమీటర్లు రాష్ట్రమంతా పర్యటిస్తానని కుప్పం నుంచి మొదలుపెట్టి ఇచ్చాపురం వరకు పాదయాత్రను సాగిస్తానని లోకేష్ పేర్కొన్నారు. ఈ క్రమంలో లోకేష్ పాదయాత్ర కోసం పాటల చిత్రీకరణ చేసింది . లోకేష్ పాదయాత్ర పాటల విషయంలో టార్గెట్ చేసిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు.
పప్పేష్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు
లోకేష్ పై పప్పేష్, బోకేష్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పప్పేష్! నీ పాదయాత్ర కోసం ఈ డాన్స్ షూటింగులు ఏంటి? అంటూ ప్రశ్నించిన విజయ సాయి రెడ్డి తెలుగు డ్రామాల పార్టీ కామెడీ షో అని ఎద్దేవా చేశారు. 'పులిని చూసి నక్క వాతలు' పెట్టుకోవడమే అంటూ మండిపడ్డారు. పాదయాత్ర డాన్స్ షూటింగులు దద్దమ్మను సిఎం చేయండని దేబిరించడానికా? అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. పార్టీ నీది కాదు. ఏం చేస్తావో చెప్పువు. పాటల షూటింగులు, 'సినిమా' ప్రమోషన్లకే కోట్లు తగలేసేటట్టున్నావు బోకేష్ అంటూ లోకేష్ ను టార్గెట్ చేసి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
చంద్రం అన్నయ్య రిటైరై దేవాతో ఆడుకో
ఇక అంతే కాదు చంద్రబాబును సైతం టార్గెట్ చేస్తున్న విజయసాయిరెడ్డి చంద్రబాబు తాజాగా చేసిన ఓ ప్రసంగం వీడియోను పోస్ట్ చేసి ఇదేం ఖర్మ తమ్ముళ్ళు మనందరికీ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై సాయి రెడ్డి సెటైర్లు వేశారు. కంటికి ప్రశాంతంగా నిద్ర పోని రాత్రులు గడపాల్సిన ఖర్మ మనందరికీ దేనికి పట్టిందని చంద్రబాబు చేస్తున్న ప్రసంగం వీడియోను పోస్ట్ చేసిన విజయసాయిరెడ్డి నిజమే అన్నయ్యా! నిన్ను చూస్తే జాలేస్తుంది అంటూ ఎద్దేవా చేశారు. పనికిమాలిన కొడుకు, రాజకీయ భవిష్యత్ శూన్యం, ఓడించిన ప్రజలపై కసి, గట్టిగా తినలేవు, నిద్రపోలేవు అంటూ విజయసాయిరెడ్డి చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్ లేదని టార్గెట్ చేశారు . ప్రతి రాత్రీ కాళ రాత్రే - ఇదేం ఖర్మ అన్నయ్యా నీకు? అంటూ హేళన చేశారు. రిటైర్ అయిపోయి దేవాతో ఆడుకో అని విజయసాయి రెడ్డి చంద్రబాబు కు సలహా ఇచ్చారు.

ఎన్నికలకు ముందే ఏపీలో పొలిటికల్ హీట్
ఇటీవల కాలంలో చంద్రబాబును పదేపదే చంద్రం అన్నయ్య అంటూ విజయసాయిరెడ్డి టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ట్విట్టర్ వేదికగా అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య చోటుచేసుకుంటున్న తీవ్రమైన విమర్శ యుద్ధం రాష్ట్రంలో రాజకీయాలను వేడెక్కిస్తోంది. చిన్న పరిణామమైనా సరే ఒకరిపై ఒకరు సెటైర్లు వేస్తూ తీవ్రస్థాయిలో దూషించుకుంటున్నారు. ఎన్నికలు రాక ముందే రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఉండే పొలిటికల్ హీట్ నిత్యం కనిపిస్తుంది.
ఇదేంటి బోకేష్: సాయిరెడ్డి ట్వీట్; తింగరి సాయిరెడ్డి.. నీ ఏ2 తెలివితేటలు: అయ్యన్న కౌంటర్!!