ఈ మేకవన్నె పులి , ఈ గుంటనక్క మానవ హక్కుల సమావేశానికి వస్తారా: విజయసాయి రెడ్డి ధ్వజం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడిని మేక వన్నె పులి, గుంటనక్క అంటూ సంబోధించిన విజయసాయిరెడ్డి మానవ హక్కుల కమిషన్ చైర్మన్, మరియు సభ్యుల ఎంపికకు సంబంధించి జగన్ అధ్యక్షతన నిర్వహిస్తున్న ఉన్నత స్థాయి సమావేశానికి చంద్రబాబు వెళ్ళాకపోవడాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.
ఈరోజు ఏపీ సచివాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మానవ హక్కుల కమిషన్ చైర్మన్, మరియు సభ్యుల ఎంపిక కోసం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు, శాసనమండలి చైర్మన్ షరీఫ్, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు హాజరు కావాల్సి ఉంది. అయితే టిడిపి సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని ప్రకటించింది. రాష్ట్రంలో ఏ వ్యక్తి హక్కులకై నా రక్షణ ఉందా అని ప్రశ్నిస్తున్న టిడిపి నేతలు హక్కులకు గౌరవం లేని ఏకైక రాష్ట్రం ఏపీ అని విమర్శిస్తున్నారు.

ఇదే సమయంలో మానవ హక్కుల కమిషన్ కు సంబంధించిన సమావేశాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు బహిష్కరించడంపై చంద్రబాబు యనమల పై విమర్శలు గుప్పించారు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. ఈ మేకవన్నె పులి... ఈ గుంటనక్క అని ఎన్టీఆర్ పేర్కొన్న చంద్రబాబు నాయుడిని, వెన్నుపోటుకు స్పీకర్ గా ఉపయోగపడిన యనమలను మానవ హక్కుల సమావేశానికి రమ్మంటే వారి ఎందుకు వస్తారు చెప్పండి ? అంటూ ఎద్దేవా చేశారు.
తమను మానవులుగా గుర్తించడం వీరిద్దరికీ ఏనాడూ ఇష్టముండదు మరి అంటూ చంద్రబాబు యనమల ఇద్దరూ మనుషులే కాదు అన్న తీరులో విజయ సాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications