LPG Crisis: గ్యాస్ వినియోగదారులకు సాయిరెడ్డి షాకింగ్ సలహా..!
ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ మొదలుపెట్టిన వార్, దానికి ప్రతీకారంగా ఆ దేశం చేస్తున్న దాడులతో పశ్చిమాసియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. గల్ఫ్ దేశాలతో మొదలుపెట్టి భారత్ వరకూ పలు దేశాలపై ఈ వార్ ప్రభావం పడుతోంది. అలాగే ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో కూడా చెప్పలేని పరిస్ధితి నెలకొంది. దీంతో ఈ వార్ మొదలుపెట్టిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పైనా ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ఆయన రోజుకో ప్రకటన చేస్తున్నారు.
మరోవైపు ఇరాన్ వార్ నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని రివల్యూషనరీ గార్డ్స్ మూసేయడంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు ఎల్బీజీ (LPG) సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతోంది. భారత్ పైనా దీని ప్రభావం మొదలైంది. ఇప్పటికే బెంగళూరు, చెన్నై సహా పలు నగరాల్లో ఎల్బీజీ సిలెండర్ల కొరతతో హోటల్స్ మూతపడే పరిస్ధితి కూడా తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (vijayasai reddy) ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు ఓ కీలక సూచన చేశారు.

ఎల్పీజీ కొరతపై వస్తున్న నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయని విజయసాయిరెడ్డి ఇవాళ ట్వీట్ చేశారు. అలాగే భారత్ అంతటా 4 లక్షలకు పైగా రెస్టారెంట్లు, ఆహార విక్రేతలను ఇది ప్రత్యక్షంగా ప్రభావితం చేయవచ్చని తెలిపారు. ప్రభుత్వం సంక్షోభాన్ని పరిష్కరిస్తున్నప్పటికీ, పశ్చిమాసియాలో వివాదం తగ్గి సరఫరా గొలుసులు స్థిరీకరించబడే వరకు ఎల్పీజీని వివేకంతో ఉపయోగించాలని తోటి పౌరులను కోరుతున్నట్లు సాయిరెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు. గ్యాస్ ఇబ్బందుల నేపథ్యంలో సాయిరెడ్డి సలహాను వినియోగదారులు ఎంత వరకూ పాటిస్తారో చూడాలి మరి.












Click it and Unblock the Notifications