• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఢిల్లీలో చంద్రబాబు తిప్పుతుంది ఈ చక్రాలేమో .. బాబుకు ఆ చికిత్స అవసరం .. విజయసాయి సెటైర్లు

|

వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ఎగ్జిట్ పోల్స్ తర్వాత చంద్రబాబు మీద మాటల దాడిని మరింత పెంచారు. ఒక పక్క ఏపీ ఎన్నికల్లో విజయం వైసీపీదే అన్న ధీమాలో ఉన్న ఆయన చంద్రబాబుపై సెటైర్లు వేశారు. రోజుకో ఇష్యూ తో టీడీపీ మీద విరుచుకుపడే విజయసాయి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై మాటల దాడి చేసారు.

పిలవకున్నా పనిగట్టుకు వెళ్తున్న చంద్రబాబు ఏపీ పరువు తీస్తున్నాడు .. వైసీపీ నేత రామచంద్రయ్య ఫైర్

చంద్రబాబు ఢిల్లీలో తిప్పే చక్రాలు ఇవేనా ? విజయసాయి పంచ్

విజయసాయి రెడ్డి తాజాగా ఢిల్లీ లో చంద్రబాబు చక్రం తిప్పుతున్నారా అంటూ ఆయన తిప్పే చక్రాలు ఇలాంటివేనా అంటూ సైకిల్ చక్రాలు, జంతికలు వంటి వాటిని పోస్ట్ చేసి సెటైర్ వేశారు.అదే ట్వీట్ లో చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పుతోందంటూ ఎల్లో మీడియా ప్రచారం చేస్తోందని చెబుతూ.. ఆ ట్వీట్ కింద వెటకారంగా చక్రాలు, సైకిల్ టైర్లు వంటి బొమ్మలను పెట్టారు. ఢిల్లీలో చక్రం తిప్పబోతున్న బాబోరు అంటూ సైరా పంచ్ వేసిన విజయసాయి రెడ్డి కూటమి భేటీ రిజల్ట్స్ తర్వాతే అని తేల్చేసిన దీదీ, మాయావతి పర్యటన రద్దు, ముఖం చాటేసిన స్టాలిన్ అంటూ ఇక బాబు తిప్పేది అక్కడ ఈ చక్రాలేనా అంటూ పంచ్ వేశారు. అంతటితో ఆగక చంద్రబాబుకు ఆయుర్వేదంలోని క్షార సూత్ర చికిత్స అవసరం అని మరో ట్వీట్ చేశారు విజయసాయి రెడ్డి .

సోనియాకు త్రిసూత్ర వ్యూహం ఏమో గానీ చంద్రబాబుకు క్షార సూత్ర చికిత్స అవసరం అన్న విజయసాయి

ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆయుర్వేదంలోని క్షారసూత్ర చికిత్స చంద్రబాబు కి చాలా అవసరం అంటూ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.ఎన్డీయేతర పార్టీలకు ఆధిక్యత వస్తే ప్రభుత్వం ఏర్పాటుకు పిలవాలని రాష్ట్రపతికి లేఖ రాయాలని సోనియాకు చంద్రబాబు ఈ ‘త్రిసూత్ర' వ్యూహాన్నివివరించారని కుల మీడియా పారవశ్యంతో రాసింది. త్రిసూత్ర ఏమో కాని ‘క్షార సూత్ర' అని ఆయుర్వేదంలో ఒక చికిత్స ఉంది. బాబుకు అర్జెంట్‌గా ఆ చికిత్స అవసరం అంటూ సెటైర్ వేశారు.

చంద్రబాబు ఫెవికాల్ కు ఏ బంధాలు అతికేలాలేవన్న విజయసాయి వ్యంగ్యాస్త్రాలు

ఇక వరుసగా మరో ట్వీట్ చేసిన విజయసాయి రెడ్డి ఇక చంద్రబాబుకు ఢిల్లీలో సహకరించేవారు ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్‌తో అనుసంధానం చేయడానికి చంద్రబాబు అంబికా అగరుబత్తిలా పనిచేస్తున్నా ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కి పోతున్నాయని సెటైర్ వేహ్సారు. అంతే కాదు బాబు వాడుతున్న ఫెవికాల్‌ (నకీలీది)తో బంధాలు ఒక పట్టాన అతకడం లేదట అంటూ చంద్రబాబు ఎంత ప్రయత్నం చేసినా బీజేపీయేతర కూటమి పక్షాలు ఒకచోటికి రావటం లేదని చెప్పుకొచ్చారు. ఢిల్లీకి రాలేమని మమత, మాయా, స్టాలిన్‌ చివరకు కుమారస్వామి కూడా చెప్పేశారట అంటూ తాజా పరిణామాల నేపధ్యంలో చంద్రబాబు ఢిల్లీలో ఒంటరి అని తేల్చేశారు విజయసాయిరెడ్డి .

English summary
Vijayasai Reddy, MP, tweeted again on AP CM Chandrababu and TDP leaders by allegedly critcizing him . Vijayasai Reddy recently said that the chandrababu is revolving in Delhi and passed a satire by posting the cycle wheels and some food . Vijayasai Reddy, MP of YCP commented that Chandrababu required a lot of Ayurvedic treatment for treating him and againg satired by saying that for intergarting regional parties and national party congress Chandrababu is working as 'Ambika Dhoopsticks" but still he is stepping a leg fronth and 2 steps back . He also said that Chandrababu's fevicol is a duplicate one and the his relations are not sticking together and his struggle on Non - BJP alliance is not uniting together.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more