బెజవాడ చంటి లొంగిపోయాడు : మహిళను వేధించిన కార్పోరేటర్..
శంషాబాద్ : విమానంలో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలు ఎదర్కొంటున్న విజయవాడ కార్పోరేటర్ ఉమ్మడి వెంకటేశ్వర్లు, అలియాస్ చంటి శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. ప్రస్తుతం చంటిని పోలీసులు విచారిస్తున్నట్టుగా సమాచారం.
ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ నుంచి హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం మీదుగా గన్నవరం బయలుదేరిన కార్పోరేటర్ చంటి, విమానంలో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంటూ శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో ఓ మహిళ కేసు నమోదు చేసింది. తనపై వచ్చిన ఆరోపణల పట్ల స్పందించిన చంటి మాత్రం అంతా అవాస్తవమని, మహిళ ఫిర్యాదును కొట్టిపారేశారు.

చంటిని కేసు నుంచి తప్పించడానికి ఓ టీడీపీ ఎంపీ కూడా ప్రయత్నాలు సాగించారనే వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే చంటి శుక్రవారం శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోవడం ఆసక్తికరంగా మారింది. మరి విచారణలో చంటి దోషి అని తేలుతుందో..! లేక పోలీసులు క్లీన్ చిట్ ఇస్తారో..! తెలియాలంటే విచారణ ముగిసే దాకా ఓపిక పట్టాల్సిందే.












Click it and Unblock the Notifications