కిరణ్ పార్టీ: ఆకాశరామన్న ఫ్లెక్సీలు, గంతులు (పిక్చర్స్)

హైదరాబాద్/విశాఖ: సీమాంధ్ర ప్రాంతంలో జై సమైక్యాంధ్ర ఫ్లెక్సీలు, జై సమైక్యాంధ్ర ప్రచార ఆర్భాటం చూస్తుంటే కొత్త పార్టీ పుట్టుకు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా బెజవాడ, గుంటూరు జిల్లాల్లో సమైక్యాంధ్ర ఫ్లెక్సీలు వెలువడడం చర్చనీయాంశంగా మారింది. విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ నేతృత్వంలో ఢిల్లీలో సమైక్యాంధ్ర పార్టీకి రిజిస్ట్రేషన్ జరిగినట్లు ప్రచారం ఊపందుకుంది.

జెండా రూపకల్పనతో పాటు సీమాంధ్రలోని పదమూడు జిల్లాల్లో జిల్లాకు లక్ష టీ షర్ట్‌లు, నియోజకవర్గానికి ఒక ప్రచార రథం చొప్పున ఆర్డర్లు ఇవ్వటం కూడా పూర్తయిందనే వార్తలు బుధవారం జోరుగా షికారు చేశాయి. లగడపాటి కొత్త పార్టీ విషయాన్ని తోసిపుచ్చటం లేదట. లగడపాటి రాజగోపాల్ తండ్రి రామానాయుడు ఇటీవల గుంటూరులో మరణించినప్పటి నుంచి ఆయన ఎక్కువ రోజులు అక్కడ గడుపుతున్నారు. ఈ నెల 16న భారీగా సంతాప కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

దీనికి కనీసం లక్ష మంది హాజరవుతారని రాజకీయ వర్గాల అంచనా. విజయవాడ నగర కాంగ్రెస్ నాయకులు రోజూ గుంటూరు వెళ్లి ఏర్పాట్లు చూసి వస్తున్నారు. ఈ నెల 23వ తేదీతో విభజన బిల్లుపై రాష్టప్రతి అసెంబ్లీకి ఇచ్చిన గడువు ముగుస్తుంది. కచ్చితంగా సరైన రీతిలో చర్చ జరుగుతూ వస్తే మరికొన్ని వారాలు గడువు అడిగే అవకాశం ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తవౌతున్నాయి. ముఖ్యమంత్రి కూడా 23వ తేదీలోపు ఏమి జరుగుతుందో చూద్దురుకదా అన్నట్లు సన్నిహితుల వద్ద వ్యాఖ్యలు చేస్తున్నారు.

కిరణ్

కిరణ్

సీమాంధ్ర ప్రాంతంలో జై సమైక్యాంధ్ర ఫ్లెక్సీలు, జై సమైక్యాంధ్ర ప్రచార ఆర్భాటం చూస్తుంటే కొత్త పార్టీ పుట్టుకు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. కిరణ్ పార్టీ పెడతారని అందరూ భావిస్తున్నారు.

ప్రచారం 1

ప్రచారం 1

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడతారనే ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలోనే విశాఖలో జై సమైక్యాంధ్ర పేరుతో ప్రచారం చేస్తున్న దృశ్యం.

ప్రచారం 2

ప్రచారం 2

కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడతారనే ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలోనే విశాఖలో జై సమైక్యాంధ్ర పేరుతో ప్రచారం చేస్తున్న దృశ్యం.

ఫ్లెక్సీ

ఫ్లెక్సీ

కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడతారనే ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలోనే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జై సమైక్యాంధ్ర పేరుతో వెలువడిన ఫ్లెక్సీలు.

ఇటీవలి కాలంలో జరిగిన బహిరంగ సభల్లో విభజన అంశంపై పార్టీ అధిష్ఠానం వైఖరిని తూర్పారపడుతూనే సరైన సమయంలో అండగా నిలవాలని కిరణ్ పదేపదే ప్రజల్ని కోరటం వెనుక ఆంతర్యం కొత్త పార్టీ ఏర్పాటు చేయాలనే ఆలోచనేనని అంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహకంగా తెలుగుతల్లి, పొట్టి శ్రీరాములు, బూర్గుల రామకృష్ణారావు ఫొటోలతో ఆంధ్రప్రదేశ్ మ్యాప్‌పై ‘సమైక్యాంధ్ర మన విధానం.. జై సమైక్యాంధ్ర మన నినాదం' అనే నినాదాలతో వెలుస్తున్న భారీ ఫ్లెక్సీలపై విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది.

కిరణ్ ప్రతిసారీ సమైక్యాంధ్ర నా నినాదం కాదు, నా విధానమంటూ చెబుతున్నారు. కొన్ని ఫ్లెక్సీలపై కర్నూలులో జరుగుతున్న ఆందోళనలు, కృష్ణా జిల్లా విద్యార్థి జెఎసి చేపట్టిన ఆందోళనల దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఎక్కడా వాటిపై ఏ ఒక్కరి పేరు కానీ, చిరునామా కానీ లేదు. అయితే కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు మాత్రం కొత్తగా ఏర్పాటయ్యే పార్టీ వైపే తమ దృష్టంతా సారించి ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌లో కొనసాగటానికి అత్యధికులు సుముఖంగా కనిపించటంలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+