టిడిపిలో బెజవాడ ట్విస్ట్: కేశినేని నానికి బాబు పిలుపు

హైదరాబాద్/విజయవాడ: విజయవాడ లోకసభ సీటు పైన తెలుగుదేశం పార్టీలో గందరగోళం ఏర్పడినట్లుగా తెలుస్తోంది. విజయవాడ లోకసభ ఇంఛార్జిగా ఉన్న కేశినేని నాని చాలా రోజులుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే, తాజాగా ఆయనకు పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు షాకిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు.

ఇంతకాలం విజయవాడ లోకసభ టిక్కెట్ ఖాయంగా కేశినేని నాని భావించారు. అయితే, తాజాగా విజయవాడ లోకసభకు బదులు విజయవాడ తూర్పు లేదా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదో ఒకటి ఎంచుకోవాలని ఆయనకు టిడిపి కార్యాలయం నుంచి సమాచారం వచ్చిందట.

Vijayawada Lok Sabha ticket twist in TDP

అంతేకాదు, తనను కలవాలని కేశినేని నానికి చంద్రబాబు సూచించారట. దీంతో ఆయన హడావుడిగా హైదరాబాదు బయలుదేరారంటున్నారు. తాను అసెంబ్లీకి పోటీ చేసే ప్రసక్తి లేదని, దీనిపై అధ్యక్షుడు చంద్రబాబుతో మాట్లాడిన తర్వాతే స్పందిస్తానని కేశినేని నాని అంటున్నారు.

ఎవరికీ మెజార్టీ రాదని చింతా మోహన్

తిరుపతి పార్లమెంటు సభ్యులు చింతా మోహన్ భవిష్యత్తుపై చిత్రమైన జోస్యం చెప్పారు. ప్రస్తుత లోకసభ ఎన్నికల్లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాదంటున్నారు. అయినా, కేంద్రంలో యూపిఏ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. 2016లో మధ్యంత ఎన్నికలు వస్తాయని, సీమాంధ్రలోనూ హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కాంగ్రెస్ కు70, టిడిపికి 70 స్థానాలు వస్తాయని, కాంగ్రెస్‌కు 25 స్థానాలు వస్తాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+