AP Assembly Election 2024: మార్నింగ్ వైసీపీ..నైట్ టీడీపీ: జలీల్ ఖాన్ రూటే సపరేటు..!!
ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాత్రికి ఓ పార్టీలో ఉంటే.. తెల్లవారే సరికి మరో పార్టీలోకి మారిపోతున్నారు. టీడీపీ నేత వైసీపీలోకి వెళ్తారన్న వార్తలతో టీటీడీ నేత కేశినేని చిన్ని అప్రమత్తమయ్యారు. బుధవారం రాత్రి కేశినేని చిన్ని జలీల్ ఖాన్ నివాసానికి వెళ్లారు. పొత్తులలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టికెట్ ను జనసేనాకు ఇస్తారని వస్తున్న ఊహగానాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
కేశినేని చిన్నితో పాటు పలువురు ముస్లిం నేతలు కూడా జలీల్ ఖాన్ నివాసానికి వెళ్లారు. దీంతో జలీల్ ఖాన్ మొత్తపడినట్లు తెలిసింది. కేశినేని చిన్ని మంత్రాంగం ఫలించడంతో జలీల్ ఖాన్ రెండు రోజులలో చంద్రబాబు, లోకేష్ ని కలవనున్నారు. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ జనసేనకు కేటాయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో తనకు టికెట్ రాదని జలీల్ ఖాన్ ఆందోళన చెందినట్లు తెలుస్తోంది.

దీంతో జలీల్ ఖాన్ బుధవారం ఉదయం ఈరోజు ఉదయం వైకాపా నేతలతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ కోసం మంతనాలు జరిపారు. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డిని కలిశారు. జలీల్ ఖాన్ విజయవాడలోని అయోధ్య రామిరెడ్డి కార్యాలయంలో ఆయనను కలిశారు. టీడీపీ నుంచి ఇప్పటికే కేశినేని వెళ్లిపోయారు. ఇప్పుడు జలీల్ ఖాన్ కూడా వెళ్లిపోతే పార్టీ నష్టమని భావించిన టీడీపీ కేశినేని చిన్నిరంగంలోకి దించింది.
అధిష్ఠానం ఆదేశాలతో కేశినేని చిన్ని బుధవారం రాత్రి 10:00 గంటలకు జలీల్ ఖాన్ నివాసంలో జలీల్ ఖాన్ తో భేటీ అయ్యారు. మాట్లాడుకుని సమస్యలు పరిష్కరించుకుందామని చెప్పారు.












Click it and Unblock the Notifications