అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నారా లోకేష్ రేపుల భాష: భగ్గుమంటోన్న వలంటీర్లు: ఫిర్యాదు చేయడానికి సమాయాత్తం

|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా చేసిన కొన్ని కామెంట్స్ కాక పుట్టిస్తున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై గ్రామ, వార్డు వలంటీర్లు భగ్గు మంటున్నారు. ఆయనపై పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ నారా లోకేష్‌పై ఫిర్యాదులు నమోదు అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం వారికి అండగా ఉండబోతున్నట్లు సమాచారం.

నో కాంప్రమైజ్: అవంతి శ్రీనివాస్ శాఖతోనే మొదలు? నెలాఖరులుగా కీలక విభాగాలు విశాఖకు?నో కాంప్రమైజ్: అవంతి శ్రీనివాస్ శాఖతోనే మొదలు? నెలాఖరులుగా కీలక విభాగాలు విశాఖకు?

నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు

జగన్ సర్కార్ కొత్తగా ప్రవేశ పెట్టిన వలంటీర్ల వ్యవస్థను ఉద్దేశించి నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వలంటీర్లలో 90 శాతం మంది వైసీపీ కార్యకర్తలే ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. తమ కార్యకర్తలు కావడం వల్లే వలంటీర్లు రేపులు చేసినా, పాపాలు చేసినా వైసీపీ ఆశీస్సులున్నాయ‌నే విషయం అర్థం అవుతోందని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అప్పగించిన బాధ్యత‌ల‌ను దండుపాళ్యం గ్యాంగుల్లా పూర్తి చేస్తున్న వలంటీర్లకు వైసీపీ హ్యాట్సాఫ్ చెప్పడంలో వింతేముంది? అని ఎద్దేవా చేశారు.

నారా లోకేష్‌పై ఫిర్యాదు


తమను అత్యాచారాలు చేసే వారిగా, దండుపాళ్యం గ్యాంగుల్లా అభివర్ణించడం పట్ల వలంటీర్లు మండిపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల మందికి పైగా ఉన్న వారంతా నారా లోకేష్‌పై తమతమ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడానికి సిద్ధపడుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను నిరు పేదల ఇళ్ల వద్దకు చేర్చుతూ ఒకరకంగా తాము సామాజిక సేవలో ఉన్నామని, అలాంటి తమను దండుపాళ్యం ముఠాగా పేర్కొనడం నారా లోకేష్ ఆలోచనా ధోరణి, వైఖరికి నిదర్శనమని విమర్శిస్తున్నారు.

Recommended Video

3 Minutes 10 Headlines | Nara Brahmani To Enter Active Politics | YSRCP MLA Deadline To YS Jagan
 రాజకీయాలకు అతీతంగా విధులు

రాజకీయాలకు అతీతంగా విధులు

తాము విధులను నిర్వరిస్తున్నామని, ఏ పార్టీకీ చెందిన కార్యకర్తలం కాదని అంటున్నారు. తమకు రాజకీయాలను అంటగట్టే ప్రయత్నం చేయవద్దని వారు నారా లోకేష్‌కు సూచించారు. ఒక్కరోజులోనే 90 శాతం మేర పింఛన్లను తాము లబ్దిదారులకు అందజేశామని గుర్తు చేశారు. తాము చేస్తోన్న పనుల వల్ల అధికార పార్టీకి మంచి పేరు వస్తోందనే కారణంతోనే అకారణంగా విమర్శలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమపై చేసిన ఘాటు వ్యాఖ్యలకు తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

English summary
Village and Ward Volunteers decides to lodged a complaint against TDP National General Secretary and former Minister Nara Lokesh. Nara Lokesh comments with strong words on Village and ward volunteers create controversy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X