కేంద్రపాలిత ప్రాంతంగా విశాఖ? కొత్త ప్రచారంతో వారికే డ్యామేజ్?
తెలుగు రాష్ట్రాలను కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తన రాజకీయాల కోసం వాడుకుంటుందని, ఇరు రాష్ట్రాలకు రెవెన్యూ లేకుండా చేసి తమ గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తోందని పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ను ఆ గడువు ముగిసిన వెంటనే కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించేందుకు కేంద్ర ఆలోచిస్తుందని, ఇక ఇదే సమయంలో విశాఖలో అత్యధిక రెవెన్యూ వచ్చే విశాఖ నగరాన్ని కూడా కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని ప్రతిపాదన కూడా కేంద్రం వద్ద ఉందని జరుగుతున్న ప్రచారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కలకలం రేపుతుంది.

విశాఖను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారా?
విశాఖ రక్షణ పరంగా అత్యంత కీలకమైన నగరమని, ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు రాజకీయ అవసరాల కోసం విశాఖ తీరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని, ఈ కారణంగానే విశాఖ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించవచ్చని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతర్గతంగా ను కేంద్రంలో ఇదే చర్చ జరుగుతుందని చెప్పుకుంటున్నారు. అయితే కేంద్రంలో చర్చను పక్కన పెడితే బయట మాత్రం విశాఖను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

విశాఖ ఏపీకి ఆదాయ వనరు.. ఏపీలో కేంద్ర పాలిత ప్రాంతంపై పెద్ద చర్చ
ఒకపక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖని కార్యనిర్వాహక రాజధానిగా ఏర్పాటు చేస్తామని అనేకసార్లు ప్రకటించింది. విశాఖ కేంద్రంగా పరిపాలన ప్రారంభిస్తామని తాజాగా కూడా మంత్రులు, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి ముఖ్య నాయకులు ప్రకటనలు చేశారు. ఇక ఈ సమయంలో కేంద్ర పాలిత ప్రాంతంగా విశాఖను చేస్తారనే చర్చ ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారీగా ఆదాయాన్ని, ఉపాధి అవకాశాలను కోల్పోయింది. ఇక ఏపీ లో ఉన్న విశాఖ నగరమే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమైన ఆదాయ వనరుగా మారింది.

విశాఖ కేంద్ర పాలిత ప్రాంతమని ప్రచారంతో నష్టం బీజేపీకే
ఈ సమయంలో విశాఖలో కేంద్ర సంస్థలు నేవి, డిఫెన్స్, పోర్టులు ఉన్నాయి. విశాఖ తీర ప్రాంత భద్రత దృష్ట్యా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా జరుగుతున్న ప్రచారం బిజెపికి తీరని నష్టం చేసే అవకాశం లేకపోలేదు. బీజేపీపై వ్యతిరేకతతోనే ఇటువంటి ప్రచారం జరుగుతోందని భావిస్తున్న పరిస్థితి ఉంది. విశాఖ ను కేంద్రపాలిత ప్రాంతం చేయడానికి ఒక శాతం అవకాశం కూడా లేదని, ఒకవేళ అలా చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటుంది అని ప్రచారం జరుగుతుంది. ఇది కేంద్రంపై తీవ్ర వ్యతిరేఖతను పెంచటానికి కారణం అవుతుంది.

ఏపీలో అసలే కష్టాల్లో ఉన్న బీజేపీకి కొత్త చిక్కులు
ఇప్పటికే బీజేపీ ప్రత్యేక హోదా విషయంలో ప్రజలకు సమాధానం చెప్పలేక ఏపీలో ఇబ్బందులు పడుతుంది. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కూడా ప్రజల్లోకి వెళ్ళలేకపోతుంది. ఇప్పుడు జరుగుతున్న కొత్త ప్రచారం కూడా బీజేపీ నేతలకు తలనొప్పిగా మారుతుంది. ఏది ఏమైనా విశాఖ నగరానికి కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేస్తారని జరుగుతున్న ప్రచారంపై బీజేపీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉన్న కారణంగానైనా, దీనిపై బిజెపి నేతలు స్పందించాల్సిన అవసరం ఉంది. కేంద్రం కూడా దీనిపై క్లారిటీ ఇస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం కూడా కొందరిలో వ్యక్తం అవుతుంది.
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
IRCTC వేసవిలో అరకు, విశాఖ టూర్ స్పెషల్ ఆఫర్ - 3 రోజులు, ప్యాకేజీ ఇలా..!! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications