టార్గెట్ ఎవరెస్ట్ అంటున్న విశాఖ చిన్నారి(ఫొటోలు)
విశాఖపట్నం: పిన్న వయస్సులోనే ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం ఎక్కేందుకు విశాఖపట్నానికి చెందిన 12ఏళ్ల చిన్నారి జాహ్నవి సిద్ధమవుతోంది. తన లక్ష్యం ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడమేనంటోంది. ఎవరెస్ట్ శిఖరంతోపాటు మిగితా ఆరు శిఖరాలను ఎక్కేందుకు కూడా ఆమె సాధన చేస్తోంది.

ఇందులో భాగంగా ఆగస్టు 2న హిమాచల్‌ప్రదేశ్ లడఖ్ ప్రాంతంలోని లే మౌంటేన్(20,080) ఎక్కడంతోపాటు ప్రపంచంలోని ఏడు శిఖరాలపైనా పాదం మోపేందుకు అక్కడ 15 రోజులపాటు శిక్షణ పొందనుంది. అనంతరం ప్రపంచంలో ఎత్తయిన శిఖరాలలో ఒకటైన కిలిమంజారో(5,895) సెప్టెంబర్‌లో తొలిసారిగా అధిరోహించనుంది.

ఆ తర్వాత ఎవరెస్ట్ శిఖరాన్ని జాహ్నవి అధిరోహించనుంది. ఈ వివరాలను ఆమె తండ్రి డాక్టర్ కృష్ణారావు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆయన కూడా గత 35 ఏళ్లుగా ట్రెక్కింగ్ చేస్తున్నారు. ఓసారి అనంతగిరి కొండల్లో పది నెలల చిన్నారి జాహ్నవిని బ్యాగులో వేసుకుని టెక్కింగ్‌కు వెళ్లారు. ఇప్పుడు ఆ చిన్నారి జాహ్నవి ఎవరెస్ట్ ఎక్కేందుకు సిద్ధమవుతువుతోంది.
తన తండ్రితో సరదాగా వెళ్లేదాన్ననని చెప్పిన జాహ్నవి.. అప్పుడే తనకు పర్వతారోహణ పట్ల ఆసక్తి పెరిగిందని జాహ్నవి చెబుతోంది. 16వేల అడుగుల ఎత్తులోని రూప్‌కుండ్ పైకి టెక్కింగ్ చేసుకుంటూ 2010లోనే వెళ్లానని జాహ్నవి చెప్పింది. తన లక్ష్యమైన ప్రపంచంలోని ఏడు ఎత్తైన శిఖరాలను అధిరోహించేందుకు తీవ్ర సాధన చేస్తున్నట్లు తెలిపింది. ఎవరెస్ట్ అధిరోహించిన బజేంద్రీపాల్, మల్లి మస్తాన్ లంటే ఇష్టమని తెలిపింది.












Click it and Unblock the Notifications