వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖ ఉత్సవ్: ప్రభుత్వానికి సిరివెన్నెల నో చెప్పారా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించనున్న విశాఖ ఉత్సవ్ 2015 కోసం థీమ్ సాంగ్ రాసేందుకు ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి నిరాకరించినట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ ఉత్సవం కోసం థీమ్ సాంగ్ రాయాలని నిర్వాహకులు సిరివెన్నెలను సంప్రదించారని చెబుతున్నారు.

Visakha Utsav scheduled to be held here from January 23 to 25

అయితే, ఆ అభ్యర్థనను ఆయన సున్నితంగా తిరస్కరించారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఉత్సవాలు శుక్రవారం నుండి ప్రారంభం అవుతాయి. ఈ నేపథ్యంలో థీమ్ సాంగ్ కోసం నిర్వాహకులు స్థానికంగా ఉన్న గేయ రచయితలను సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది.

కాగా, విశాఖ ఉత్సవ్ కోసం థీమ్ సాంగ్‌ను ప్రముఖ గీత రచయితతో రాయిస్తానని మంత్రి గంటా శ్రీనివాస రావు ఇప్పటికే చెప్పారు. అందుకోసం ఆయనను కలిసినప్పటికీ సున్నితంగా నిరాకరించారని సమాచారం. 23వ తేదీన శుక్రవారం ప్రారంభమయ్యే విశాఖ ఉత్సవ్ 2015 మూడు రోజుల పాటు జరగనుంది. మరోవైపు, విశాఖ ఉత్సవ్ కోసం సిద్ధమవుతోంది. విశాఖ ఉత్సవ్ కోసం వచ్చే వారి సెఫ్టీ, సెక్యూరిటీ పైన దృష్టి సారించారు.

English summary
Visakha Utsav scheduled to be held here from January 23 to 25
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X