Visakhapatnam Lok Sabha Election 2024 Results LIVE: రాజధానిపై విశాఖ తీర్పు ఎటు ?

విశాఖపట్నం లోక్‌సభ ఎన్నికలు 2024 ఫలితాలు ప్రత్యక్ష ప్రసారాలు: ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత ఉత్కంఠ రేపిన పార్లమెంటు నియోజకవర్గాల్లో విశాఖపట్నం లోక్ సభ సీటు కూడా ఒకటి. ఎందుకంటే ఇక్కడ వైసీపీ మూడు రాజధానుల ప్రకటన తర్వాత మారిన పరిస్ధితులు, వైసీపీపై వచ్చిన భూకబ్జా ఆరోపణలు, శాంతిభద్రతలు, సంక్షేమం, కుల సమీకరణాలు ఇలా ఎన్నో అంశాలు ఈసారి విశాఖ తీర్పులో కీలకంగా మారాయి.

విశాఖ పార్లమెంట్ సీటులో గత ఎన్నికలకూ, ఈసారి ఎన్నికలకూ రాజకీయాలు వేగంగా మారిపోయాయి. 2019లో వైసీపీ గాలిలో అనాయాసంగా విశాఖ ఎంపీ సీటును కైవసం చేసుకున్న వైసీపీ, ఆ తర్వాత మూడు రాజధానుల్లో భాగంగా విశాఖను అసలు రాజదాని చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఇక్కడ ఆ పార్టీకి సానుకూలతను తెచ్చాయి. అయితే దీన్ని కొనసాగించడంలో వైసీపపీ విఫలమైందన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా భూకబ్జాలతో వైసీపీ నేతలు చేసిన హంగామా స్థానికుల్లో విమర్శలకు కారణమైంది. అయితే ఇప్పటికీ నగరంలోని విశాఖ నార్త్, సౌత్ అసెంబ్లీ సీట్లలో ఆ పార్టీకి సానుకూలత కనిపిస్తోంది.

AP election Results Visakhapatnam Lok Sabha Election 2024 Results voting counting live updates news in telugu

వైసీపీ తరఫున విశాఖ నుంచి పోటీ చేసేందుకు గట్టి అభ్యర్ధులెవరూ దొరక్కపోవడంతో విజయనగరానికి చెందిన మంత్రి బొత్స సతీమణి ఝాన్సీ లక్ష్మిని తీసుకొచ్చారు. మహిళా అభ్యర్ధి కావడం, విద్యావంతురాలు కావడం, వైసీపీ సంక్షేమ పథకాల బలం వంటివి ఆమెను గెలిపిస్తాయని వైసీపీ భారీ ఆశలే పెట్టుకుంది. కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను పూర్తిగా అడ్డుకోలేకపోవడం, నగరంలో స్థానికంగా కీలక నేతలు వైసీపీని వీడి టీడీపీ, జనసేనలోకి వెళ్లిపోవడం వంటి పరిణామాలు ఝాన్సీకి మైనస్ గా మారాయి.

అదే సమయంలో పూర్తిగా అర్బన్ పరిధిలో ఉన్న విశాఖ లోక్ సభ ఓటు బ్యాంక్ టీడీపీ, బీజేపీ, జనసేనతో కూడిన కూటమికి కలిసి వస్తోంది. అలాగే నగరంలో టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీలు కూడా అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తుండటం, గతంలో వైసీపీ గాలిలోనూ నగరంలో టీడీపీ సత్తా చాటుకున్న చరిత్ర కూటమికి ప్లస్ కానున్నాయి. అలాగే గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి టీడీపీ అభ్యర్ధి మతుకుమిల్లి భరత్ కు కలిసి వస్తున్నాయి. గీతం మూర్తి మనవడు, బాలకృష్ణ చిన్న అల్లుడైన భరత్ యువకుడు, విద్యావంతుడు కావడం, క్లీన్ ఇమేజ్ ఈసారి ఆయన గెలుపుకు బాటలు వేస్తాయనే అంచనాలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+