Visakhapatnam–LTT Express: విశాఖ-లోక్ మాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ కు కొత్త స్టాప్..!
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం-ముంబైలోని లోక్ మాన్య తిలక్ టెర్మినస్ మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు రైల్వే శాఖ ఇవాళ ఓ అలర్ట్ ఇచ్చింది. ఈ రెండు స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించే ఎక్స్ ప్రెస్ రైలుకు అదనపు స్టాప్ సౌకర్యం కల్పించారు. ఈ స్టాప్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది, సదరు స్టాప్ లో ఈ రైళ్లు ఎప్పుడెప్పుడు ఆగుతాయన్న వివరాలను దక్షిణ కోస్తా రైల్వే అధికారులు ఇవాళ విడుదల చేశారు. దీంతో నిడదవోలు నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులు దీన్ని గమనించాల్సి ఉంటుంది.
ముందుగా విశాఖపట్నం నుంచి లోక్ మాన్య తిలక్ టెర్మినస్ కు వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలు (Visakhapatnam-LTT Express) నంబర్ 18519కి నిడదవోలులో తెల్లవారుజామున 2.54కు స్టాప్ సౌకర్యం కల్పించారు. ఒక్క నిమిషం పాటు రైలు ఈ స్టేషన్ లో ఆగుతుంది. అలాగే లోక్ మాన్య తిలక్ టెర్మినస్ నుంచి విశాఖపట్నానికి వచ్చే ఎక్స్ ప్రెస్ రైలు (LTT-Visakhapatnam Express) నంబర్ 18520కు సైతం నిడదవోలులో ఉదయం 6.09కి స్టాప్ కల్పించారు. ఈ రెండు రైళ్లకు నిడదవోలు స్టాప్ సౌకర్యం సెప్టెంబర్ 5 నుంచి అందుబాటులోకి రానుంది.

అయితే నిడదవోలు రైల్వే స్టేషన్ లో ఈ స్టాప్ ను ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగానే ఇస్తున్నారు. ఇది విజయవంతమైతే, అంటే ఇక్కడి నుంచి తగినంత మంది ప్రయాణికులు ఈ రైళ్లలో రెగ్యులర్ గా ప్రయాణిస్తుంటే ఈ స్టాప్ ను భవిష్యత్తులోనూ కొనసాగిస్తారు. లేకపోతే మధ్యలోనే దీన్ని తొలగిస్తారు. కాబట్టి ఇక్కడ స్టాప్ కోరుకుంటున్న ప్రయాణికుల రాకపోకల ఆధారంగా ఈ స్టాప్ సౌకర్యం కొనసాగుతుందని భావించవచ్చు. కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి చేస్తున్న ప్రయత్నాలతో ఇప్పటికే నిడదవోలు స్టేషన్ లో పలు రైళ్లకు వరుసగా హాల్ట్ లు కల్పిస్తున్నారు.














Click it and Unblock the Notifications