"వన్ ఎంపీ... వన్ ఐడియా" వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన విశాఖ ఎంపీ
విశాఖపట్నం: విశాఖపట్నం పార్లమెంట్ నియోజక వర్గంలో ఎంపీ నిధులు అందరికీ ఉపయోగపడేలా ఎలా ఖర్చు చేయాలో మంచి సలహాలను ఇవ్వాలంటూ ఎంపీ కంభంపాటి హరిబాబు ప్రజలను కోరారు. "వన్ ఎంపీ... వన్ ఐడియా" పేరుతో వాల్ పోస్టర్‌ను ఆదివారం విసాఖలో ఆవిష్కరించారు.
సంవత్సారనికి ఒక్కో ఎంపీకి రూ. 5 కోట్లు నిధులు వస్తాయని, వాటిని ఏ విధంగా తన నియోజకవర్గ అభివృద్ధికి వినియోగించాలో మంచి సలహాలు ఇవ్వాల్సిందిగా కోరారు. వాటి వల్ల అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

ఎవరైనా సరే తమ ఆలోచనలను పంచుకోవచ్చని, అన్నింటికంటే మంచి ఆలోచనలు, సలహాలు ఇచ్చిన వారికి బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications