అలర్ట్: విశాఖపట్నం వెళ్లే రైళ్ల టైమింగ్స్ మారాయి
గతేడాది ఒడిసాలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైన దుర్ఘటనలో దాదాపు 300కు పైగా ప్రయాణికులు అసువులు బాశారు. దానికి కారణం సిగ్నలింగ్ వ్యవస్థలో లోపమేనని ఉన్నతాధికారులు గుర్తించడంతో అప్పటి నుంచి దేశవ్యాప్తంగా అన్ని జోన్లు, డివిజన్ల పరిధిలో సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునికీకరిస్తున్నారు. దీనిలో భాగంగా విజయవాడ, విశాఖపట్నం డివిజన్ల పరిధిలో కూడా పనులు జరుగుతుండటంతో కొన్ని రైళ్ల సమయాలను ఈనెల 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మార్పులు చేశారు. ఈ రైళ్లు విశాఖ జంక్షన్ కు చేరుకునే సమయంలోనే మార్పులు జరిగాయి. మిగతా స్టేషన్ల సమయాలు యథావిధిగానే ఉన్నాయి.
న్యూఢిల్లీ-విశాఖపట్నం(20806) ఏపీ ఎక్స్‌ప్రెస్ తెల్లవారుజామున 4.10 గంటలకు బదులుగా 4.20 గంటలకు చేరుకుంటుంది.
హైదరాబాద్-విశాఖపట్నం (12728) గోదావరి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ తెల్లవారుజామున 5.45 గంటలకు బదులుగా 5.55 గంటలకు చేరుకుంటుంది.
కోర్బా-విశాఖపట్నం(18517) ఎక్స్‌ప్రెస్ ఉదయం 6.25 గంటలకు బదులుగా 6.40 గంటలకు చేరుకుంటుంది.
సికింద్రాబాద్-విశాఖపట్నం (12740) గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 7.40 గంటలకు బదులుగా 7.50 గంటలకు చేరుకుంటుంది.
మచిలీపట్నం-విశాఖపట్నం (17219) ఎక్స్‌ప్రెస్ ఉదయం 8.10 గంటలకు బదులుగా 8.20 గంటలకు చేరుకుంటుంది.
బ్రహ్మపూర్-విశాఖపట్నం (08531) ప్యాసింజర్ స్పెషల్ ఉదయం 9.20 గంటలకు బదులుగా 9.30 గంటలకు చేరుకుంటుంది.

కాకినాడ పోర్ట్-విశాఖపట్నం (17267) ఎక్స్‌ప్రెస్ ఉదయం 9.30 గంటలకు బదులుగా 9.40 గంటలకు చేరుకుంటుంది.
భవానీపట్న-విశాఖపట్నం (08503) ప్యాసింజర్ స్పెషల్ ఉదయం 10.00 గంటలకు బదులుగా 10.10 గంటలకు చేరుకుంటుంది.
గాంధీదాం-విశాఖపట్నం (20804) వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 10.10 గంటలకు బదులుగా 10.20 గంటలకు చేరుకుంటుంది.
దుర్గ్-విశాఖపట్నం (18529) ఎక్స్‌ప్రెస్ ఉదయం 10.20 గంటలకు బదులుగా 10.30 గంటలకు చేరుకుంటుంది.
లోకమాన్యతిలక్ టెర్మినస్-విశాఖపట్నం (18520) ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్ ఉదయం 10.40 గంటలకు బదులుగా 10.50 గంటలకు చేరుకుంటుంది.
రాయ్‌పూర్-విశాఖపట్నం (08527) ప్యాసింజర్ స్పెషల్ రాత్రి 6.40 గంటలకు బదులుగా 7.00 గంటలకు చేరుకుంటుంది.
కిరండూల్-విశాఖపట్నం (08552) ప్యాసింజర్ స్పెషల్ రాత్రి 8.20 గంటలకు బదులుగా 8.45 గంటలకు చేరుకుంటుంది.
గుణుపూర్-విశాఖపట్నం (08521) ప్యాసింజర్ స్పెషల్ రాత్రి 8.45 గంటలకు బదులుగా 9.00 గంటలకు చేరుకుంటుంది.
సికింద్రాబాద్-విశాఖపట్నం (20834) వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రాత్రి 11.31 గంటలకు బదులుగా 11.35 గంటలకు చేరుకుంటుంది.
18వ తేదీ నుంచి కొల్లాం-విశాఖపట్నం (18568) వీక్లీ ఎక్స్‌ప్రెస్ రాత్రి 11.40 గంటలకు బదులుగా 11.45 గంటలకు చేరుకుంటుంది
19 నుంచి భగత్ కి కోటి-విశాఖపట్నం (18574) వీక్లీ ఎక్స్‌ప్రెస్ ఉదయం 9.50 గంటలకు బదులుగా 10.00 గంటలకు చేరుకుంటుంది.
20 నుంచి నాందేడ్ -విశాఖపట్నం (20812) వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 9.10 గంటలకు బదులుగా 9.20 గంటలకు చేరుకుంటుంది.
20 నుంచి తిరుపతి-విశాఖపట్నం (22708) డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 10.30 గంటలకు బదులుగా 10.40 గంటలకు చేరుకుంటుంది.
హజరత్ నిజాముద్దీన్-విశాఖపట్నం (12804)స్వర్ణజయంతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 2.15 గంటలకు బదులుగా 2.45 గంటలకు చేరుకుంటుంది.
22 నుంచి లోకమాన్యతిలక్ టెర్మినస్-విశాఖపట్నం(22848) వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ తెల్లవారు 5.00 గంటలకు బదులుగా 5.10 గంటలకు చేరుకుంటుంది.












Click it and Unblock the Notifications